Balakrishna : మొన్న చిరు, ఇవాళ బాలయ్య.. డైరెక్టర్లకు చురకలు!

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన చిత్రం 'వేద'.. ఈ నెల 10వ తారీఖున తెలుగులో విడుదల చేస్తున్నారు. నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ డైరెక్టర్ ల వైరల్ కామెంట్స్ చేశాడు.

Balakrishna : మొన్న చిరు, ఇవాళ బాలయ్య.. డైరెక్టర్లకు చురకలు!

Balakrishna viral comments on directors

Balakrishna : బాహుబలి, కేజీఎఫ్, RRR సినిమాలతో ఇండస్ట్రీ ఇండస్ట్రీకి మధ్య కంచెలు తొలిగిపోయాయి. ఇప్పుడు సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయిన తరువాత పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటే అది పాన్ ఇండియా సినిమానే. అలా వచ్చినవే కాంతార, కార్తికేయ-2 చిత్రాలు. సొంత గడ్డ పై సూపర్ సక్సెస్ ని అందుకుంటే చాలు ఆ సినిమాని ఇతర భాషల్లో కూడా డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేస్తున్నారు మేకర్స్. తాజాగా కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న మూవీ.. ఇతర భాషల్లో రిలీజ్ కి సిద్దమవుతుంది.

Balakrishna : నర్సులకు క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ..

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన చిత్రం ‘వేద’. గత ఏడాది డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా శివరాజ్ కుమార్ 125వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడనాట బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ నెల 10వ తారీఖున తెలుగులో విడుదల చేస్తున్నారు. దీంతో నిన్న (ఫిబ్రవరి 7) ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మాదాపూర్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. “కంటెంట్ ఉన్న ప్రతి సినిమా నేడు పాన్ ఇండియా మూవీనే. అలాంటి ఒక మంచి సినిమా తెరకెక్కాలి అంటే హీరో, దర్శకుడు, నిర్మాత మధ్య ఒక మంచి సంబంధం ఉండాలి. అప్పుడే ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటారు. అలా కాకుండా నేను చెప్పిందే కథ, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటే మంచి సినిమాలు రావు. నా వీరసింహారెడ్డి సినిమాలో పెద్ద బాలకృష్ణ గెటప్ కి.. శివరాజ్ మఫ్టీ మూవీలోని గెటప్ అయితే బాగుంటుందని దర్శకుడికి సలహా ఇచ్చా. నేడు ఆ సినిమాకే ఆ క్యారెక్టర్ గెటప్ హైలైట్ అయ్యింది” అంటూ వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో చిరంజీవి కూడా డైరెక్టర్ల పై ఇటువంటి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరు స్టార్ హీరోలు డైరెక్టర్ల పై ఇటువంటి కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.