Balakrishna: ఎఫ్3 సినిమాపై బాలయ్య ప్రశంసలు

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్3’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను గతంలో....

Balakrishna: ఎఫ్3 సినిమాపై బాలయ్య ప్రశంసలు

Balakrishna Watches F3 Movie

Balakrishna: యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్3’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను గతంలో వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు చిత్ర యూనిట్. కాగా.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మరోసారి తమదైన కామెడీతో రెచ్చిపోయారు. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

Balakrishna: తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్‌పై బాలయ్య.. మామూలుగా ఉండదట!

ఇక ఈ సినిమాను తాజాగా నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా వీక్షించారు. ఆయనతో పాటు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బాలయ్య అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్3 సినిమాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ సినిమాను ఆడియెన్స్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారని.. ఇలాంటి సినిమాతో మళ్లీ ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పించిన ఘనత అనిల్ రావిపూడికే దక్కిందని బాలయ్య అన్నారు. ఈ సినిమాలో నటించిన నటీనటులపై బాలయ్య ప్రశంసలు కురిపించాడు.

Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్‌ను ఫిక్స్ చేసిన అనిల్..?

కాగా.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించగా, ఈ మూవీలో తమన్నా, మెహ్రీన్, సోనల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, సునీల్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, తన నెక్ట్స్ మూవీని బాలకృష్ణతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.