NBK107: బాలయ్య ఉగాది గిఫ్ట్.. కొత్త సినిమా టైటిల్ రివీల్?

మాస్ డైరెక్టర్ బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు.

NBK107: బాలయ్య ఉగాది గిఫ్ట్.. కొత్త సినిమా టైటిల్ రివీల్?

Nbk107

NBK107: మాస్ డైరెక్టర్ బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. ముందుగా గోపీచంద్ మలినేనితో సినిమా మొదలు పెట్టిన బాలయ్య ప్రస్తుతం ముమ్మర షూటింగ్ లో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా శృతి హాసన్ బాలయ్యకి జోడీగా నటిస్తుంది. అఖండ సినిమా సక్సెస్ కీలకమైన థమన్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు.

NBK107: బాలయ్య ద్విపాత్రాభినయం.. మరోసారి తండ్రికొడుకులుగా?

బాలయ్య కెరీర్ లో ఇది 107వ సినిమా కాగా బాలయ్యను గోపీచంద్ ఎలా చూపించనున్నాడా అని అభిమానులలో ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్లే ఈ మధ్యే విడుదల చేసిన పక్కా మాస్‌ లుక్‌లో బాలయ్య మెరుపులు మెరిపించాడు. ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ కు అభిమానులు ఫిదా అయిపోగా ఇప్పుడు తెలుగు సంవత్సరాది శుభదినాన అభిమానులకు మరో సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

NBK107: బాలయ్య ఫస్ట్ లుక్.. స్టైలిస్ట్ మాసివ్ అవతార్!

షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా.. ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు. అయితే.. ఇప్పుడు గోపీచంద్ అండ్ టీం నుండి బాలయ్య 107 సినిమా టైటిల్ ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఉగాది పండుగ రోజు, ఈ నెల 2వ తేదీన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే ఈ శనివారం వరకు ఆగాల్సిందే.