Liger : లైగర్ కోసం బాలయ్య, అమితాబ్.. పూరి పర్ఫెక్ట్ ప్లాన్

పూరి బాలకృష్ణతో 'పైసా వసూల్', అమితాబ్ తో 'బుడ్డా హోగా తేరా బాప్' సినిమాలు చేసాడు. వీరిద్దరితో పూరికి మంచి ర్యాపొ ఉంది. ఈ స్నేహంతోనే వీళ్ళిద్దర్నీ

Liger : లైగర్ కోసం బాలయ్య, అమితాబ్.. పూరి పర్ఫెక్ట్ ప్లాన్

Puri

Liger :  డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ప్రతి సినిమాకి కొత్తగా, గ్రాండ్ గా ఏదైనా ట్రై చేయడానికి చూస్తాడు. ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి హిట్ కొట్టిన త‌ర్వాత పూరి విజయ్ దేవ‌ర‌కొండ హీరోగా ‘లైగ‌ర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బాక్సింగ్ నేప‌థ్యంలో ఉండబోతుంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి అయింది. ఇక బాక్సింగ్ సినిమా కావ‌డంతో ఇప్పటి వరకు ఎవ్వరు ట్రై చేయని విధంగా, ఎవ్వరు ఊహించని విధంగా ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్‌ని సినిమాలోకి తీసుకొచ్చారు. మైక్ టైసన్ ‘లైగర్’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

Balakrishna – Nani : న్యాచురల్ స్టార్ తో నటసింహం.. సెకండ్ ఎపిసోడ్ ఫ్యాన్స్ స్పెషల్

ఇటీవలే మైక్ టైస‌న్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మైక్ టైసన్ ‘లైగర్’ సినిమాలో ఉండటంతో ఈ సినిమాకి మరిన్ని అంచనాలు పెరిగాయి. ‘లైగ‌ర్’ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. అయితే ఇందులో మైక్ టైస‌న్ పాత్ర‌కు ఎవ‌రో ఒక‌రు డ‌బ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. పూరీ జ‌గ‌న్నాథ్ తెలుగు, హిందీ మార్కెట్స్ ని గట్టిగా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగు, హిందీ భాషల్లో మైక్ టైసన్ కి డబ్బింగ్ కోసం అమితాబ్ బ‌చ్చ‌న్, బాల‌కృష్ణ‌ల‌ను సంప్ర‌దించార‌ట‌. హిందీలో అమితాబ్ తో, తెలుగులో బాల‌య్యతో డ‌బ్బింగ్ చెప్పించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ దశ దిన కర్మ.. అన్నదానాలు.. నేత్రదాన శిబిరాలు..

పూరి బాలకృష్ణతో ‘పైసా వసూల్’, అమితాబ్ తో ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాలు చేసాడు. వీరిద్దరితో పూరికి మంచి ర్యాపొ ఉంది. ఈ స్నేహంతోనే వీళ్ళిద్దర్నీ మైక్ టైసన్ కి డబ్బింగ్ అడిగాడని సమాచారం. అయితే వాళ్ళ దగ్గర్నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ చిత్రం ఉంది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ పూరి వీళ్ళిద్దర్నీ అడిగే ఛాన్స్ ఉంది. పూరి ‘లైగర్’ సినిమా కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అర్ధమవుతుంది.