Akhanda: బాలయ్య-బోయపాటి.. టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేస్తారా?

బాల‌క్రిష్ణ సినిమా రిలీజ్ అంటేనే ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేష‌న్స్ పీక్స్ లో ఉంటాయి, అలాంటిది యాక్ష‌న్ స్పెష‌లిస్ట్ అయిన బోయపాటితో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ రిలీజ్ అంటే ఆ సినిమా మీద..

Akhanda: బాలయ్య-బోయపాటి.. టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేస్తారా?

Akhanda

Akhanda: బాల‌క్రిష్ణ సినిమా రిలీజ్ అంటేనే ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేష‌న్స్ పీక్స్ లో ఉంటాయి, అలాంటిది యాక్ష‌న్ స్పెష‌లిస్ట్ అయిన బోయపాటితో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ రిలీజ్ అంటే ఆ సినిమా మీద ఎక్స్ పెక్టేష‌న్స్ స్త్ర రేంజ్ లో ఉంటాయో అర్దం చేసుకోవ‌చ్చు. ట్రైల‌ర్ తోనే సినిమా రేంజ్ మ‌రోసారి చూపించిన బోయ‌పాటి బాల‌య్య‌కు హ్యా్ట్రిక్ హిట్ అందిస్తాడా..? ఈ కాంబినేష‌న్ టాలీవుడ్ లో మ‌రో ట్రెండ్ సెట్ చేస్తుందా..?

Hansika Motwani: యాపిల్ బ్యూటీ హన్సిక గ్లామర్ ట్రీట్!

బాల‌య్య మ‌రోసారి త‌న మాస్ ప‌వ‌ర్ చూపించ‌డానికి రెడీ అయ్యారు. బోయ‌పాటి-బాల‌క్రిష్ణ కాంబినేష‌న్లో రిల‌జ్ కు రెడీ అయిన హై ఓల్టేజ్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ట్రైల‌ర్ తో సినిమా మీద అంచ‌నాల్ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ క్రేజీ కాంబినేష‌న్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో అంద‌రి కాన్స‌న్ ట్రేష‌న్ అఖండ సినిమా మీదే ఉంది. అందుకే అఖండ మూవీ భారీ హైప్స్ తో డిసెంబ‌ర్ 2న థియేట‌ర్లోకి వ‌స్తోంది.

Ram Charan: జెర్సీ దర్శకుడితో స్పోర్ట్స్ డ్రామా.. చెర్రీ కల తీరేవేళ!

అఖండ మూవీ ఇటు బాల‌య్యకు అటు బోయ‌పాటికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే.. ఆల్రెడీ కెరీర్ లో ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్న ఈఇద్ద‌రికీ ఇప్పుడు హిట్ చాలా అవ‌స‌రం. అందుకే అఖండ సినిమాని బాల‌య్య ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా రెడీ చేశారు బోయపాటి. బాల‌య్య మార్క్ డైలాగ్స్, హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎపిసోడ్సతో పాటు బాల‌య్య అఘోరాగా నెవ‌ర్ బిఫోర్ లుక్ లో క‌నిపించ‌డం ఈ సినిమా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్స్.

Pooja Hegde: మాల్దీవుల్లో అందాల మంట పెట్టిన పూజా హెగ్డే.. బాప్ రే బికినీ షో..!

బాల‌య్య‌-బోయపాటి కాంబినేష‌న్లో ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన సింహ‌, లెజెండ్ సినిమాలు బాల‌య్య కెరీర్ లో వ‌న్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అందుకే ఈ సినిమా మీద విపరీత‌మైన ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఆల్రెడీ బోయ‌పాటి విన‌యవిధేయ‌రామ‌తో డిజాస్ట‌ర్ ఫేస్ చేసినా కూడా బాల‌య్య మ‌రో సినిమా ఛాన్స్ ఇవ్వ‌డంతో మ‌ళ్లీ పే బ్యాక్ చెయ్యాల్సిన సిచ్యువేష‌న్ బోయ‌పాటిది. అందుకే ఫాన్స్ ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ తో ఉన్నారో, వాటిని అదే రేంజ్ లో రీచ్ అవ్వ‌డానికి ట్రై చేస్తున్నారు బోయ‌పాటి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన వీడియోస్, సాంగ్స్, లేటెస్ట్ ట్రైల‌ర్ తో సినిమా హిట్ గ్యారంటీ అని ఫుల్ హైప్స్ తో ఉన్నారు ఫ్యాన్స్.