Pawan – Balayya : పవన్‌ని ‘భయ్యా’ అని పిలిచిన బాలయ్య.. అన్‌స్టాపబుల్!

బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో.. నిజం గానే బాప్ అఫ్ అల్ టాక్ షోస్ అనిపించుకుంటుంది. అసలు ఎటువంటి టాక్ షోస్ కి హాజరవ్వని పవన్ కళ్యాణ్ ని ఈ సెకండ్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్‌కి తీసుకువచ్చాడు బాలయ్య. ఇక ఎపిసోడ్ లో బాలకృష్ణ, పవన్ ని ఏమి జరిగింది అనేదే అందరిలో ఆశక్తిని రేపుతోంది.

Pawan – Balayya : పవన్‌ని ‘భయ్యా’ అని పిలిచిన బాలయ్య.. అన్‌స్టాపబుల్!

balayya called pawan kalyan as bhayya

Pawan – Balayya : బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో.. నిజం గానే బాప్ అఫ్ అల్ టాక్ షోస్ అనిపించుకుంటుంది. బాలయ్య తన ముక్కుసూటి తనం, చిలిపితనం, హడావుడితో అన్‌స్టాపబుల్ షోని అన్‌స్టాపబుల్‌గా ముందుకు తీసుకుపోతున్నాడు. మొదటి సీజన్ ఎండింగ్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్రాండ్‌గా ముగింపు పలికిన బాలకృష్ణ.. సెకండ్ సీజన్‌ని అంతకంటే గ్రాండ్‌గా నారా చంద్రబాబు నాయుడుతో మొదలుపెట్టాడు.

Pawan Kalyan: బాలయ్య కోసం వస్తున్న పవన్.. టాక్ షోకు కాదండోయ్!

దీంతో సెకండ్ సీజన్ మొదటి నుంచే సూపర్ సక్సెస్‌గా దూసుకుపోతుంది. ఇక ఇటీవలే అన్‌స్టాపబుల్‌కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ని తీసుకు రాగా, ఆ ఎపిసోడ్ ఈ శుక్రవారం ప్రసారం కానుంది. కాగా ఈ సీజన్‌కి ఎండ్ కార్డు ఎవరు ఊహించని రీతిలో ప్లాన్ చేశారు షో నిర్వాహకులు. అసలు ఎటువంటి టాక్ షోస్ కి హాజరవ్వని పవన్ కళ్యాణ్ ని ఈ సెకండ్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్‌కి తీసుకువచ్చాడు బాలయ్య.

ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ నిన్న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ, పవన్ ని ఏమి జరిగింది అనేదే అందరిలో ఆశక్తిని రేపుతోంది. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం బాలయ్య, పవన్‌ని ‘భయ్యా’ అంటూ పిలిచాడు అంటా. రాజకీయ పరంగా, సినిమా పరంగా ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ భయ్యా అని పిలివడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ.. ‘గుడుంబా శంకర్’ సినిమాలోని పవన్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి కూడా ప్రస్తావించాడు అంటా.