డైరెక్షన్ చేసేవాడు.. పాపం.. కూరగాయలు అమ్ముతున్నాడు..

  • Published By: sekhar ,Published On : September 29, 2020 / 04:25 PM IST
డైరెక్షన్ చేసేవాడు.. పాపం.. కూరగాయలు అమ్ముతున్నాడు..

director ram vriksha gaur: లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక నష్టాలు.. నిరుద్యోగం పెరిగిపోయాయి. దీని ఎఫెక్ట్‌ చాలా రంగాలపై పెద్ద ప్రభావాన్నే చూపిస్తుంది. సినీ రంగం విషయానికి వస్తే.. షూటింగ్స్ ఆగిపోవడంతో సినిమానే నమ్ముకున్న చాలా మంది, కుటుంబ నిర్వహణకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూట గడవటం కోసం ఏదో ఒక పని చేయాలని సినీ రంగాన్ని వదలేసినవాళ్లు కూడా ఉన్నారు.

ఆ కోవలో ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కూరగాయలు అమ్ముతున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. ‘బాలికావధు’ వంటి పాపులర్‌ సీరియల్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా (కొన్ని ఎపిసోడ్లకు దర్శకత్వం కూడా వహించారు) పనిచేసిన రామ్‌ వృక్షగౌర్‌ ఈ కరోనా వల్ల పనేదీ దొరక్కపోవడంతో కుటుంబ నిర్వహణ కోసం కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.


సినిమా చేయాల్సిన తాను తన స్వగ్రామం అజంఘడ్‌ వచ్చానని, లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వెళ్లే అవకాశం లేకుండా పోయిందని రామ్‌ అన్నారు. తాను సినిమా చేయాల్సిన నిర్మాత సినిమా ఆగిపోయిందంటూ ఫోన్‌ చేసి చెప్పారని, దాంతో ఏం చేయాలో తెలియలేదని.. అదే సమయంలో నాన్న చేసే కూరగాయల వ్యాపారం గుర్తొచ్చి తాను కూడా అదే వ్యాపారం చేయాలనకున్నానని తెలిపారు.

తాను చేస్తున్న పని గురించి తాను బాధపడటం లేదని చెబుతున్న రామ్‌ గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. హిందీలో సునీల్ శెట్టి, రణదీప్ హుడా, యష్‌పాల్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్, మలింద్ గుణాజి వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు రామ్.