నటిస్తే నా కుటుంబం ఒక్కటే.. సినిమా తీస్తే 200ల కుటుంబాలు బాగుంటాయి.. నేను బతుకుతుందే మా అమ్మా నాన్న కోసం.. కంటతడి పెట్టించిన బండ్ల గణేష్..

  • Published By: sekhar ,Published On : August 26, 2020 / 03:57 PM IST
నటిస్తే నా కుటుంబం ఒక్కటే.. సినిమా తీస్తే 200ల కుటుంబాలు బాగుంటాయి.. నేను బతుకుతుందే మా అమ్మా నాన్న కోసం.. కంటతడి పెట్టించిన బండ్ల గణేష్..

Bandla Ganesh about his family: బండ్ల గణేష్.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి నిర్మాతగా ఎదిగాడు.. వ్యాపారాలు, రాజకీయాలు, కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచే గణేష్ ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెట్ చేశారు బండ్ల. ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడే గణేష్ ఈ ప్రోగ్రామ్‌లో ఎమోషనల్ అయ్యారు. తన కుటుంబం గురించి తల్లిదండ్రుల గురించి చెబుతూ కంటతడి పెట్టుకున్నారు.



కరోనా నుంచి కోలుకున్న తర్వాత తనలో ఇంతకుముందున్న అహం అణిగిపోయిందని ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. కొంతగ్యాప్ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారాయన. తర్వాత సినిమాలు ఎందుకు చేయలేదని అడిగితే.. నేను నటిస్తే నా కుటుంబం మాత్రమే బాగుంటుంది.. అదే నిర్మాతగా సినిమా తీస్తే 200ల కుటుంబాలు బాగుంటాయని అన్నారు.
https://10tv.in/sonu-sood-offers-accommodation-20000-migrant-workers-noida/
రాత్రి 8 తర్వాత నా కుటుంబంతోనే ఉంటాను అంటావంట ఏంటని ప్రశ్నించగా.. నేను బతుకుతుందే మా అమ్మా నాన్న కోసం.. అని తల్లిదండ్రుల గురించి తన పిల్లల గురించి చెప్తూ కంటతడి పెట్టుకున్నారు బండ్ల గణేష్.. ఈ ఎపిసోడ్ ఆగస్టు 31న టెలికాస్ట్ కానుంది.