Dhamaka: రవితేజ తప్ప ఎవరు చేసినా ‘ధమాకా’ ఫ్లాప్.. బండ్ల గణేష్ కామెంట్స్!

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా, పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మాస్ అంశాలను మాస్ రాజా తనదైన రీతిలో పండించడంతో అభిమానులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు రిపీటెడ్‌గా వస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు క్రాస్ చేయగా, తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్.

Dhamaka: రవితేజ తప్ప ఎవరు చేసినా ‘ధమాకా’ ఫ్లాప్.. బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh Comments On Raviteja Dhamaka Success

Dhamaka: మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా, పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మాస్ అంశాలను మాస్ రాజా తనదైన రీతిలో పండించడంతో అభిమానులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు రిపీటెడ్‌గా వస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు క్రాస్ చేయగా, తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్.

Dhamaka : 50 కోట్ల ధమాకా.. రవితేజ గ్రాండ్ కమ్ బ్యాక్..

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ధమాకా సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మాస్ రాజా అనే పదం కేవలం రవితేజ కోసమే పుట్టిందని.. రవితేజ లాంటి ఎనర్జిటిక్ స్టార్‌కు పర్ఫెక్ట్ కథ తగిలితే ఇలాంటి ధమాకా వస్తుందని ఆయన అన్నారు. ఇక రవితేజ తప్ప ఈ సినిమాను ఎవరు చేసినా ఒక్కరోజుకే ఫ్లాప్ అయ్యేదని ఆయన కామెంట్ చేశారు. బండ్ల గణేష్ తనదైన స్టయిల్‌లో ధమాకా సినిమా గురించి ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ధమాకా చిత్రంలో రవితేజ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, అందాల భామ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అదనపు ఆకర్షణగా నిలవగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేకర్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి.