Bandla Ganesh : గబ్బర్‌సింగ్‌కి పదేళ్లు.. హరీష్‌శంకర్‌కి అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల..

ఇటీవలే గబ్బర్ సింగ్ సినిమా వచ్చి పదేళ్లు పూర్తయింది. బండ్ల గణేష్ ఇంత భారీ హిట్ ఇచ్చినందుకు హరీష్ శంకర్ కు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఖరీదైన వాచ్ ని...................

Bandla Ganesh : గబ్బర్‌సింగ్‌కి పదేళ్లు.. హరీష్‌శంకర్‌కి అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల..

Hareesh Shankar

 

Hareesh Shankar :  పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వరుస అపజయాలతో ఉన్న సమయంలో గబ్బర్ సింగ్ సినిమాతో వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖుషి తర్వాత ఆ రేంజ్ లో గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాని డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించగా నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. బండ్ల గణేష్ కెరీర్ లో కూడా నిర్మాతగా ఇది భారీ విజయం.

 

ఇటీవలే గబ్బర్ సింగ్ సినిమా వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, బండ్ల గణేష్ లకు శుభాకాంక్షలు తెలిపారు. బండ్ల గణేష్ ఇంత భారీ హిట్ ఇచ్చినందుకు హరీష్ శంకర్ కు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. బండ్ల గణేష్ హరీష్ శంకర్ కు వాచ్ పెట్టిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. థ్యాంక్స్ బ్రదర్. గబ్బర్ సింగ్ సమయంలో మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మీరు నాకు ఎప్పటికి స్పెషల్. మీరు లేకపోతే ఈ సినిమా అంత వేగంగా పూర్తి అయ్యేది కాదు అని పోస్ట్ చేశారు హరీష్.

Adivi Sesh : చందమామ సినిమాలో హీరో నేనే.. కానీ షూట్ చేసి మరీ తీసేశారు..

హరీష్ శంకర్ ఈ వీడియోని పోస్ట్ చేయగా పలువురు అభిమానులు దీనిని రీట్వీట్ చేస్తూ విషెష్ తెలియచేస్తున్నారు. ఇదే కాంబోలో మరో సినిమా తీయండి అంటూ కామెంట్ చేస్తున్నారు.