MAA Election : రేప్‌లు, మర్డర్లు ఐతే జరగలేదుగా..! మా పోలింగ్ గొడవపై బండ్ల గణేశ్ రియాక్షన్

తాను ఓటేసినవాళ్లు కచ్చితంగా గెలుస్తారని చెప్పిన బండ్ల గణేశ్... తాను ఎవరికి ఓటేశాననేది మాత్రం బయటపెట్టలేదు.

MAA Election : రేప్‌లు, మర్డర్లు ఐతే జరగలేదుగా..! మా పోలింగ్ గొడవపై బండ్ల గణేశ్ రియాక్షన్

Bandla Ganesh

MAA Election : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు క్లైమాక్స్ కొచ్చేశాయి. పోలింగ్ లో పెద్దసంఖ్యలో సినీ సెలబ్రిటీలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఐతే… ప్రకాశ్ రాజ్, నరేష్ మధ్య మాటల ఘర్షణతో… పోలింగ్ మొత్తం వాడీవేడిగా జరిగింది. ఐనప్పటికీ.. ఏదీ పెద్దగా బయటకు రాకుండా.. సినీ పెద్దలు చొరవ తీసుకున్నారు. గొడవలు పడ్డప్పటికీ… అధికారికంగా ఎవరూ బయటపడలేదు. కసురుకోవడాలు, కొరుక్కోవడాలు, తిట్లు, శాపనార్థాలు… రుసరుసలు… పబ్లిక్ గానే వినిపించాయి.

ఓటు వేసిన చిరంజీవి, రామ్ చరణ్, పవన్

ఈ గొడవలపై నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికరంగా స్పందించారు. “గొడవలా… ఏం గొడవ…. ఎలక్షన్స్ అన్నాక గొడవలు కావా…. మర్డర్లుఐతే అవ్వట్లేదు.. మానభంగాలు కావట్లేదు.. కామ్ గా సంతోషంగా నవ్వుకుంటూ ఎలక్షన్ జరుగుతోంది… బ్రహ్మాండంగా జరుగుతోంది.. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది.. తప్పకుండా ఎవరో ఒకరు గెలుస్తారు.. ఇది మాత్రం రాసిస్తా. 26 మంది ఈసీ సభ్యులు గెలుస్తారు.. ప్రెసిడెంట్ గా ఒకరు వీపీగా ఒకరు గెలుస్తారు.. ఇంకేమైనా క్లారిటీ కావాలా…” అని చమత్కరించారు బండ్ల గణేశ్.

తాను ఓటేసినవాళ్లు కచ్చితంగా గెలుస్తారని చెప్పిన బండ్ల గణేశ్… తాను ఎవరికి ఓటేశాననేది మాత్రం బయటపెట్టలేదు.

శివ బాలాజీని కొరుకుతున్న హేమ..!