Bandla Ganesh : తండ్రి మాట వినకపోతే బన్నీలాగా తయారవుతారు.. వింటే.. బండ్లగణేష్ వ్యాఖ్యలు..

తాజాగా బండ్ల గణేష్ దర్శకుడు గుణశేఖర్ కూతురి పెళ్ళికి వెళ్లారు. అక్కడికి అల్లు అర్జున్ అన్నయ్య బాబీ కూడా వచ్చాడు. బండ్ల గణేష్ బాబీని పలకరిస్తూ అక్కడున్న మీడియాతో మాట్లాడాడు. పక్కనే బాబీని పెట్టుకొని.........

Bandla Ganesh : తండ్రి మాట వినకపోతే బన్నీలాగా తయారవుతారు.. వింటే.. బండ్లగణేష్ వ్యాఖ్యలు..

 

Bandla Ganesh :  బండ్ల గణేష్ కమెడియన్, నిర్మాతగా కంటే కూడా ఇటీవల కాలంలో తన స్పీచ్ లు, ఇంటర్వ్యూలు, మాటలతోనే బాగా ఫేమస్ అయ్యాడు. దీంతో బండ్ల గణేష్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బండ్లన్న ఏది ఉన్నా ఓపెన్ గా మాట్లాడేస్తాడు, ఎవరిగురించి అయినా. తాజాగా బండ్ల గణేష్ దర్శకుడు గుణశేఖర్ కూతురి పెళ్ళికి వెళ్లారు. అక్కడికి అల్లు అర్జున్ అన్నయ్య బాబీ కూడా వచ్చాడు.

బండ్ల గణేష్ బాబీని పలకరిస్తూ అక్కడున్న మీడియాతో మాట్లాడాడు. పక్కనే బాబీని పెట్టుకొని.. అందరికి చెప్తున్నా వినండి. తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చింది చేస్తే మా బన్నీలాగా అవుతారు. అదే చిన్నప్పట్నుంచి తండ్రి మాట వింటే ఇలా బాబీలాగా తయారవుతారు. కాబట్టి తండ్రిమాట వినకండి. తండ్రి మాట వినకుండా సొంత ఇర్ణయాలు తీసుకొని బన్నీ లాగా అవ్వాలా? లేక బాబీ లాగా అవ్వాలా మీరే డిసైడ్ చేసుకోండి అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

BiggBoss 6 Day 91 : బిగ్‌బాస్‌‌లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా??

బండ్లన్న చేసిన ఈ వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం అలా ఒకర్ని కంపేర్ చేసి మీడియా ముందు మాట్లాడకూడదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో మరోసారి బండ్లన్న సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. అయితే ఈ మాటలని బాబీ మాత్రం సరదాగా తీసుకొని నవ్వేశారు.