Bandla Ganesh : పవన్, బండ్ల గణేష్ ని విడగొట్టింది ‘గురూజీ’నేనా?.. ట్విట్టర్లో ఇండైరెక్ట్‌గా త్రివిక్రమ్‌పై పంచులు.. మరోసారి బండ్ల గణేష్ వర్సెస్ త్రివిక్రమ్..
బండ్ల గణేష్ వస్తే పవన్ కళ్యాణ్ పై అదిరిపోయే స్పీచ్ ఇస్తాడు, ఆ స్పీచ్ వైరల్ అవుతుంది. కానీ త్రివిక్రమ్ బండ్ల్ గణేష్ ని దూరం పెడుతున్నాడని తెలిసి పవన్ ఫ్యాన్స్ గతంలో త్రివిక్రమ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి బండ్ల గణేష్ - త్రివిక్రమ్ ఇష్యూ జరుగుతోంది.

Bandla Ganesh Tweets on Trivikram goes viral Trivikram Vs Bandla Ganesh in Pawan Kalyan Matters
Trivikram : బండ్ల గణేష్(Bandla Ganesh) సినిమాలకు దూరంగా ఉన్నా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇటీవల కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ – త్రివిక్రమ్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి బండ్ల గణేష్ ని దూరం చేస్తున్నాడని, పవన్ సినిమా ఈవెంట్స్ కి బండ్ల గణేష్ ని త్రివిక్రమ్ రానివ్వట్లేదని వార్తలు వచ్చాయి. వీటిపై బండ్ల గణేష్ ఇండైరెక్ట్ గానే అవును అంటూ సమాధానం కూడా ఇచ్చాడు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు.
బండ్ల గణేష్ వస్తే పవన్ కళ్యాణ్ పై అదిరిపోయే స్పీచ్ ఇస్తాడు, ఆ స్పీచ్ వైరల్ అవుతుంది. కానీ త్రివిక్రమ్ బండ్ల్ గణేష్ ని దూరం పెడుతున్నాడని తెలిసి పవన్ ఫ్యాన్స్ గతంలో త్రివిక్రమ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి బండ్ల గణేష్ – త్రివిక్రమ్ ఇష్యూ జరుగుతోంది. త్రివిక్రమ్ ని సినీ పరిశ్రమలో గురూజీ అని అంటారని అందరికి తెలిసిందే. తాజాగా ఓ నెటిజన్ ప్రొడ్యూసర్ కావాలంటే ఏం చేయాలి అని బండ్ల గణేష్ కి ట్వీట్ చేశాడు. దీనికి బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ.. గురూజీని కలిసి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వు అయిపోతావు అని ట్వీట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. త్రివిక్రమ్ నే ఇండైరెక్ట్ గా అన్నాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
మరో నెటిజన్.. గురూజీకి కథ చెప్తే స్క్రీన్ ప్లే రాసి దానికి తగ్గట్టు కథ మార్చి, ఆ కథని షెడ్ కి పంపిస్తారని టాక్ ఉంది అని బండ్ల గణేష్ కి ట్వీట్ చేయగా, దీనికి బండ్ల గణేష్ సమాధానమిస్తూ.. అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ అని ట్వీట్ చేశాడు. దీంతో బండ్లన్న ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ అయితే కచ్చితంగా త్రివిక్రమ్ కే అని అందరికి అర్థమైపోతుంది. ఇండైరెక్ట్ గా తనని, పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ విడతీశాడని బండ్ల గణేష్ చెప్తున్నట్టు ఉంది అతని ట్వీట్ చూస్తుంటే. దీనికి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటే గురూజీ ఫ్యాన్స్ మాత్రం బండ్ల గణేష్ పై ఫైర్ అవుతున్నారు. గతంలో కూడా ఈ ఇష్యూ మీద త్రివిక్రమ్ స్పందించలేదు. మరి బండ్ల గణేష్ ఇంత డైరెక్ట్ గా ట్వీట్ చేసిన తర్వాత అయినా స్పందిస్తారేమో చూడాలి.
Meet Guruji & give costly gift it will happen 😜 https://t.co/BdvLvTwbbs
— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023
అదే కాదు భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ 😝 https://t.co/P6J844y0fa
— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023