Bangarraju : ‘లడ్డుండా’ అంటూ స్వర్గంలో సోగ్గాడి ఆట..

‘బంగార్రాజు’ ఆల్బమ్‌లోని ‘లడ్డుందా’ అనే ఫస్ట్ సాంగ్.. నవంబర్ 9 ఉదయం 9:09 గంటలకు రిలీజ్ చెయ్యబోతున్నారు..

Bangarraju : ‘లడ్డుండా’ అంటూ స్వర్గంలో సోగ్గాడి ఆట..

Bangarraju

Bangarraju: కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న క్రేజీ ఫిలిం ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి ప్రీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బంగార్రాజు’ లో రమ్యకృష్ణ, కృతి శెట్టి ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మిస్తున్నారు.

Sree Vishnu : ఎన్టీఆర్ ఫ్యాన్‌గా శ్రీ విష్ణు.. గ్రామ వాలంటీర్‌గా హీరోయిన్!

సంక్రాతి రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ‘బంగార్రాజు’ రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. ఆదివారం అక్కినేని అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు టీం. ‘ సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ అంటూ వదిలిన పోస్టర్ సింప్లీ సూపర్బ్.. పంచె కట్టులో కింగ్ మరింత గ్లామర్‌గా కనిపిస్తున్నారు.

Bangarraju : కష్టమైనా కృతినే ఫిక్స్ చేశారు.. ఎంత ఇస్తున్నారో తెలుసా..!

నవంబర్ 9న ఉదయం 9:09 గంటలకు ‘బంగార్రాజు’ ఆల్బమ్‌లోని ‘లడ్డుండా’ అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నారు. స్వర్గంలో ‘బంగార్రాజు’ రంభ, ఊర్వశి, మేనకలతో కలిసి ఈ పాటలో స్టెప్స్ వెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. భాస్కరభట్ల లిరిక్స్ రాశారు.

Ghost Movie : కింగ్ పక్కన కాజల్ బదులు జాక్వెలిన్..