Bangarraju : వాసి వాడి తస్సాదియ్యా.. రెండు రోజుల్లో రచ్చ లేపారుగా!

కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది..

Bangarraju : వాసి వాడి తస్సాదియ్యా.. రెండు రోజుల్లో రచ్చ లేపారుగా!

Bangarraju

Bangarraju: కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకిది ప్రీక్వెల్. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేశారు.

Aha : ‘ఆహా’లో తెలుగు ‘ఇండియ‌న్ ఐడిల్‌’కి విశేష స్పందన!..

సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగ్, చైతు కలిసి నటించడం, పైగా పండక్కి ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూసే సినిమా కావడం, పైగా అన్ని చోట్ల నుండి హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తున్నాయి.

Aha : ‘ఆహా’లో తెలుగు ‘ఇండియ‌న్ ఐడిల్‌’కి విశేష స్పందన!..

ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 17 కోట్లుకు పైగా గ్రాస్ వసూలు చేసిన ‘బంగార్రాజు’ రెండో రోజు అంతకుమించి అంటే రూ. 36 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూడో రోజుతో బ్రేక్ ఈవెన్‌కి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ లాంటి పాన్ ఇండియా సినిమాలు వెనక్కి తగ్గినా.. రిస్క్ చేసి డేర్ స్టప్ తీసుకున్న నాగ్ అండ్ టీం అందుకుతగ్గ ప్రతిఫలం పొందిందనే చెప్పాలి.

Bangarraju Trailer : అక్కినేని తండ్రీకొడుకులు అదరగొట్టారుగా!