Bangarraju: బంగార్రాజు సినిమా నాగ్‌ది కాదు.. చైతూదా?

ఈ సంక్రాంతికి భారీ క్రేజీ ప్రాజెక్టులేవీ లేకపోయినా నేనున్నా అంటూ ముందుకొచ్చాడు సీనియర్ హీరో నాగార్జున. ఎలాగూ తెలుగులో మాత్రమే క్రేజీ ఉండే సబ్జెక్టు కావడం.. పెద్ద సినిమాలేవీ..

Bangarraju: బంగార్రాజు సినిమా నాగ్‌ది కాదు.. చైతూదా?

Bangarraju

Bangarraju: ఈ సంక్రాంతికి భారీ క్రేజీ ప్రాజెక్టులేవీ లేకపోయినా నేనున్నా అంటూ ముందుకొచ్చాడు సీనియర్ హీరో నాగార్జున. ఎలాగూ తెలుగులో మాత్రమే క్రేజీ ఉండే సబ్జెక్టు కావడం.. పెద్ద సినిమాలేవీ పోటీలేకపోవడంతో ఈ సంక్రాంతి తనకు బాగా కలిసొచ్చే అంశం అనుకున్న నాగ్ బంగార్రాజుగా జనవరి 14న వచ్చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్లు సినిమా మీద ఆసక్తి పెంచేయగా తాజాగా వచ్చిన ట్రైలర్ అనుమానాలు అక్కర్లేదు.. ఈ సంక్రాంతికి చూడాల్సిన సినిమా ఇదే అనేలా ఒక స్టాంప్ పడేలా చేసుకున్నాడు.

Chiranjeevi Anushka: మరోసారి మెగాస్టార్‌తో జతకట్టనున్న జేజెమ్మ!

కాగా.. ట్రైలర్ చూసిన తర్వాత అక్కినేని అభిమానులకు ఒక డౌట్ వచ్చేసింది. బంగార్రాజు సినిమా నాగార్జునది కదా.. నాగ చైతన్యదా అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు ఇది సోగ్గాడే చిన్నినాయన సినిమాకి బంగార్రాజు సినిమా సీక్వెల్ గా చెప్పాడు. నాగార్జున హీరో కాగా నాగ చైతన్య ముఖ్య పాత్రగా ఈ సినిమా మొదలు పెట్టారని అనుకున్నారు. కానీ.. తీరా ట్రైలర్ చూస్తే ఇది చైతన్య సినిమా కాగా.. నాగార్జునది ఓ కామియో పాత్రగా కనిపిస్తుంది. అయితే.. ఇది సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ అన్నది నిజమే.

Samantha-Akshay: సమంత ఇంట్లో అక్షయ్ దొంగతనం.. ఇదేం పాడు బుద్దని పోస్ట్!

సోగ్గాడే సినిమాలో కొడుకు కోసం బంగార్రాజు మళ్ళీ భూలోకానికి వచ్చి సందడి చేస్తాడు. ఇప్పుడు బంగార్రాజు సినిమాలో కూడా మనవడి కోసం.. మనవడి సమస్యల కోసం మళ్ళీ భూలోకానికి వస్తాడని తెలుస్తుంది. అయితే.. సోగ్గాడే సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రలలో నాగార్జునే కనిపించడంతో అది పూర్తి నాగార్జున సినిమా కాగా.. ఇందులో నాగచైతన్య పాత్ర రియాలిటీ కాగా.. నాగార్జున పాత్రే కామియోగా కనిపిస్తుంది. అంటే సోగ్గాడేలో నాగార్జున సినిమాలో నాగార్జున కామియో రోల్ లో కనిపిస్తే.. బంగార్రాజు సినిమాలో చిన్న బంగార్రాజు కోసం నాగ్ కామియో రోల్ లో కనిపిస్తున్నాడు.