Naga Chaitanya : నవ ‘మన్మథుడు’ వచ్చాడు.. ‘చిన్న బంగార్రాజు’ గా చైతన్య..

‘చిన్న బంగార్రాజు’ గా యువసామ్రాట్ నాగ చైతన్య..

Naga Chaitanya : నవ ‘మన్మథుడు’ వచ్చాడు.. ‘చిన్న బంగార్రాజు’ గా చైతన్య..

Bangarraju Teaser

Naga Chaitanya: కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకిది ప్రీక్వెల్. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు.

Naga Chaitanya : ‘వాసివాడి తస్సాదియ్యా.. వచ్చాడయ్యా ‘బంగార్రాజు’..

‘శివగామి’ రమ్యకృష్ణ, కృతి శెట్టి ఫీమేల్ లీడ్స్‌గా కనిపించనున్నారు. నవంబర్ 23న చైతన్య బర్త్‌డే సందర్భంగా ఒకరోజు ముందుగా ‘బంగార్రాజు’ గా చై లుక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసిన టీం, బర్త్‌డే రోజు ‘చిన్న బంగార్రాజు’ ని చూపించడానికి టీజర్ రిలీజ్ చేశారు.

Laddunda Song : ‘లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’ – నాగ్ భలే పాడాడుగా!

పెద్ద బంగార్రాజుగా నాగార్జున ఫొటోను చూపిస్తూ.. ‘బంగార్రాజు’ లా రెడీ అయిన ‘చిన్న బంగార్రాజు’ ని రివీల్ చేశారు. చైతు లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపించాయి. అనూప్ రూబెన్స్ ఆర్ఆర్, జె.యువరాజ్ విజువల్స్ టీజర్‌కి ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.