Nagarjuna : ‘బంగార్రాజు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

తాజాగా 'బంగార్రాజు' డిజిటల్‌ రిలీజ్‌కు రెడీ అవుతుంది. 'బంగార్రాజు' సినిమా డిజిటల్ రైట్స్ ని జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాతే....

Nagarjuna :  ‘బంగార్రాజు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Bangarraju

 

Bangarraju :  అక్కినేని హీరోలు, తండ్రి, కొడుకులు నాగార్జున-నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘బంగార్రాజు’ ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అయి మంచి విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది. అక్కినేని కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది ఈ సినిమా. గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ తెరకెక్కింది. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకొని థియేటర్స్ లో సందడి చేసింది.

BiggBoss : బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. ఓటీటీలో 24/7.. వచ్చేస్తుంది..

తాజాగా ‘బంగార్రాజు’ డిజిటల్‌ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ‘బంగార్రాజు’ సినిమా డిజిటల్ రైట్స్ ని జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. తాజాగా ‘బంగార్రాజు’ ఓటీటీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 18వ తేదీన జీ5 ఓటీటీలో ‘బంగార్రాజు’ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు జీ5 సంస్థ తమ సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేసింది. థియేటర్స్ లో మిస్ అయినవారు ‘బంగార్రాజు’ సినిమాని ఫిబ్రవరి 18 నుంచి జీ5 ఓటీటీలో చూసేయొచ్చు.