Pori Moni: డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్.. ఆ రాజకీయ నాయకుడి పనేనా?

బంగ్లాదేశ్ స్టార్ హీరోయిన్ ఇంట్లో భారీగా డ్రగ్స్, విదేశీ మద్యం పట్టుబడింది. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ కావడంతో ఈ వార్త ఆ దేశంలో సంచలంగా మారింది. అంతేకాదు.. ఇది తనపై కక్ష్యపూరితంగా చేసిన పనేనని ఆమె మీడియాకెక్కడంతో ఇది కాస్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఆ స్టార్ హీరోయిన్ పోరీ మోనీ. అసలు పేరు షామ్‌సున్నాహర్‌

Pori Moni: డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్.. ఆ రాజకీయ నాయకుడి పనేనా?

Pori Moni

Pori Moni: బంగ్లాదేశ్ స్టార్ హీరోయిన్ ఇంట్లో భారీగా డ్రగ్స్, విదేశీ మద్యం పట్టుబడింది. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ కావడంతో ఈ వార్త ఆ దేశంలో సంచలంగా మారింది. అంతేకాదు.. ఇది తనపై కక్ష్యపూరితంగా చేసిన పనేనని ఆమె మీడియాకెక్కడంతో ఇది కాస్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఆ స్టార్ హీరోయిన్ పోరీ మోనీ. అసలు పేరు షామ్‌సున్నాహర్‌. బుధవారం (ఆగష్టు5) బంగ్లాదేశ్‌ యాంటీ-టెర్రర్‌ స్క్వాడ్‌ మోనీ ఇంటి మీద దాడులు చేసి నాలుగు గంటలపాటు సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు దొరికినట్లుగా ప్రకటించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా మూడు రోజుల రిమాండ్ విధించింది.

Pori Moni

Pori Moni

సరిగ్గా నెల రోజుల క్రిందట పోరీ మోనీ జూన్‌ 8న ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు నజీర్‌ ఉద్దీన్‌ మహమ్మూద్‌ మీద లైంగిక ఆరోపణలు చేసింది. బోట్‌ క్లబ్‌ వద్ద నజీర్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే.. నజీర్ మీద ఎలాంటి కేసు నమోదు కాలేదు. తనకున్న పలుకుబడితోనే కేసులు నమోదు కాకుండా మేనేజ్ చేసుకున్నా.. నెటిజన్లు, సిటిజన్ల నుండి పోరీ మోనీకి భారీ మద్దతు లభించింది. దీంతో ఏకంగా బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు ఆమె ఫేస్‌బుక్‌ ద్వారా న్యాయం కోసం విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు నిందితుడు నజీర్‌, ముగ్గురు మహిళల్ని, నజీర్‌ సహచరుడైన డ్రగ్‌ డీలర్‌ తుహిన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అదలా ఉండగానే జూన్ 7న (మోనీ లైంగిక ఆరోపణలు చేయకముందు రోజు) మోనీ గుల్షన్‌ ఆల్‌ కమ్యూనిటీ క్లబ్‌ పై దాడి చేసిందని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కూడా నజీర్ అరెస్ట్ అనంతరం ఈ ఫిర్యాదు చేయడం విశేషం కాగా ఫిర్యాదు చేసిన క్లబ్ కు నజీర్ డైరెక్టర్. కాగా, ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్.. బెయిల్ మీద విడుదల.. నజీర్ కూడా బెయిల్ మీద విడుదల కావడం అన్నీ జరిగిపోయాయి. అదలా ఉండగానే మోనీ మాత్రం సోషల్ మీడియా వేదికగా తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తుండగానే రాపిడ్ యాక్షన్ బెటాలియన్ ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించి ఆమెను ఆమెతో పాటు మరో ముగ్గురి మీద కూడా నార్కోటిక్ కేసులు నమోదు చేశారు. దీంతో ఇది ఆ ప్రముఖుడి పనేనా? అనే చర్చలు జరుగుతున్నాయి.