Bathuku Busstand : హీరోగా అల్లు అర్జున్ కజిన్.. ట్రైలర్ లాస్ట్ పంచ్ అదిరిందిగా..!

బన్నీ కజిన్ విరాన్ ముత్తంశెట్టి ‘బతుకు బస్టాండ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు..

Bathuku Busstand : హీరోగా అల్లు అర్జున్ కజిన్.. ట్రైలర్ లాస్ట్ పంచ్ అదిరిందిగా..!

Bathuku Busstand

Bathuku Busstand: అల్లు ఫ్యామిలీ తరపు నుండి మరో కొత్త హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. బన్నీ కజిన్ విరాన్ ముత్తంశెట్టి ‘బతుకు బస్టాండ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నికిత అరోరా, శృతి శెట్టి హీరోయిన్లు. ఇలవల ఫిల్మ్స్ బ్యానర్‌పై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు.

Bathuku Busstand : బన్నీ కజిన్ ‘విరాన్’ సాంగ్ విన్నారా..!

‘బ‌తుకు బ‌స్టాండ్’ అనే టైటిల్ పెట్టిన‌ట్లుగా ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. డిఫరెంట్‌గా చేస్తున్న ప్రమోషన్స్‌కు సోష‌ల్ మీడియాలో అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన రెండు పాట‌ల‌ు యూట్యూబ్‌లో విశేషాద‌ర‌ణ అందుకుంటున్నాయి. శుక్రవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ డైరెక్టర్ పరశురామ్ రిలీజ్ చేశారు.

సినిమా మీద అంచనాలు పెంచేలా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘మౌనంగా ఉంటున్నానని ముని అనుకుంటున్నావేమో.. నాలో ఒక విశ్వామిత్రుడు కూడా ఉండి ఉండొచ్చు’.. అనే డైలాగ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిచింది. ట్రైలర్ చివర్లో ఒక క్యారెక్టర్.. ‘ఏంటి, బతుకు బస్టాండా.. ఎవరిది, ప్రొడ్యూసర్‌దా, డైరెక్టర్‌దా?’ అని అడగ్గా.. విరాన్ ‘ప్రతి దానికి మీనింగ్ లెతకడానికి ట్రై చెయ్యకు వాయ్.. సినిమా చూసి, టైటిల్ కరెక్టో కాదో చెప్పు’ అంటూ ఇచ్చిన పంచ్ భలే పేలింది.

Bathuku Busstand

 

ట్రైల‌ర్‌‌కు సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు ఐ.ఎన్. రెడ్డి తెలిపారు. కంటెంట్‌తో పాటు క‌మ‌ర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఆడియెన్స్‌కి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చేలా ఈ సినిమాను రూపొందించిన‌ట్లు నిర్మాత‌లు ఐ. క‌వితా రెడ్డి, కె. మాధ‌వి అన్నారు. షూటింగ్ కంప్లీట్ అయిందని, త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామని అన్నారు.