Bigg Boss 5 : బిగ్ బాస్ హోటల్.. పీక్స్ లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్

తాజాగా బిగ్‌బాస్‌ లో బీబీ హోటల్‌ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ ఒక హోటల్. ఇందులో కంటెస్టెంట్స్ అంతా హోటల్ లో ఉండే పర్సన్స్ లా యాక్ట్ చేయాలి.

Bigg Boss 5 : బిగ్ బాస్ హోటల్.. పీక్స్ లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్

Bb Hotel

Bigg Boss 5 :  మొన్నటిదాకా గొడవలతో సాగిన బిగ్ బాస్ గత మూడు రోజుల నుంచి కొంచెం సరదాగా సాగుతుంది. ఈ సరదా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు గాని ప్రస్తుతానికి ప్రేక్షకులు గొడవల్లేకుండా హాయిగా బిగ్ బాస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో ఏ టాస్క్ ఇచ్చినా బిగ్ బాస్ కంటెస్టెంస్ట్ గొడవలు పడేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చే టాస్కులతో కంటెస్టెంట్స్ ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ ప్రియాంకకి సపోర్ట్ ఇవ్వం : తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ

తాజాగా బిగ్‌బాస్‌ లో బీబీ హోటల్‌ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ ఒక హోటల్. ఇందులో కంటెస్టెంట్స్ అంతా హోటల్ లో ఉండే పర్సన్స్ లా యాక్ట్ చేయాలి. ఇందులో హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌లో ఉంటూనే అతిథులకిచ్చే సర్వీసులను చెడగొట్టమని రవికి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్ బాస్.

Hyper Aadi : ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వాళ్ళందర్నీ.. సైలెంట్ గా హైపర్ ఆది సెటైర్

బీబీ హోటల్‌లో శ్రీరామ్‌ చెఫ్ గా, షణ్ముఖ్‌ వెయిటర్ గా, యానీ మాస్టర్‌ మేనేజర్‌, రిసెప్షనిస్ట్‌గా, రవి ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్ గా, మానస్‌ – ప్రియాంక హనీమూన్‌కు వచ్చిన జంటగా, కాజల్‌ హోటల్‌ ఓనర్‌కు స్నేహితురాలుగా , సన్నీమొదటిసారి 5 స్టార్‌ హోటల్‌కు వచ్చిన అతిథిగా, సిరి ఎంతో గారాబంగా పెరిగిన డాన్‌ కూతురుగా నటించాలి అని తెలిపారు. ఈ టాస్క్‌లో హోటల్‌ సిబ్బంది అతిథుల నుంచి 15 వేల రూపాయలు సంపాదించగలిగితే వారు గెలిచినట్లు లెక్క అని చెప్పాడు బిగ్ బాస్.

Rana : ఏం టైంపాస్ గాళ్లురా మీరు.. మరోసారి ఫేక్ న్యూస్ పై రానా సెటైర్

టాస్క్‌ మొదలవగానే కంటెస్టెంట్స్ అంత ఒకర్ని మించి ఇంకొకరు నటించసాగారు. దొరికిందే ఛాన్స్‌ అనుకున్న సిరి షణ్ముఖ్‌ను ముప్పుతిప్పలు పెడుతుంది. షన్ను భరిస్తూ సిరి చెప్పిన పనులు వెయిటర్ గా చేస్తున్నాడు. సిరి ఓ పని చెప్పగా సిరితో ఈజీ కాదు అని పాట పాడుతూ స్విమ్మింగ్‌ పూల్‌లోని నీటిని స్పూన్‌తో తీస్తూ కాఫీ కప్పు నింపాడు షణ్ను. దీంతో అతడికి సిరి టిప్పిచ్చింది. సన్నీ తనను టచ్‌ చేస్తుంటే సైలెంట్‌గా ఉన్నావేంటని మానస్‌ తో గొడవ పడింది ప్రియాంక. రవి పక్కవాళ్ళ పనులు చెడగొట్టడానికి చూస్తున్నాడు. కాజల్ కూడా హోటల్ మొత్తం తనదే అని బిల్డప్ ఇస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. రవి.. కాజల్‌ బ్యాగులోంచి డబ్బులు కొట్టేసి ఏమీ ఎరగనట్లు తన పని తానూ చేసుకుంటుండగా కాజల్‌ డబ్బులు పోయాయంటూ అరిచింది. ఇక కాజల్, సన్నీ, సిరిలు అతిధులుగా రావడంతో వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేసారు. సిరి షన్నుతో, సన్నీ రవితో, కాజల్ యాని మాస్టర్ తో కాళ్ళు కడిగించుకున్నారు. ఈ బిబి హోటల్ ఇవాళ్టి ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవ్వనుంది. మరో హోటల్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.