Thalaivar169: బొక్క బోర్లాపడిన బీస్ట్.. రజినీ కోసం నెల్సన్ జాగ్రత్తలు!

బీస్ట్ సినిమా బొక్క బోర్లా పడడటంతో జాగ్రత్త పడుతున్నాడు నెల్సన్. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విజయ్ బీస్ట్ మూవీ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోక అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. దాతో డైరెక్టర్ తను సూపర్ స్టార్ తో చెయ్యబోయే సినిమాకి ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నాడు.

Thalaivar169: బొక్క బోర్లాపడిన బీస్ట్.. రజినీ కోసం నెల్సన్ జాగ్రత్తలు!

Thalaivar169

Thalaivar169: బీస్ట్ సినిమా బొక్క బోర్లా పడడటంతో జాగ్రత్త పడుతున్నాడు నెల్సన్. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విజయ్ బీస్ట్ మూవీ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోక అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. దాతో డైరెక్టర్ తను సూపర్ స్టార్ తో చెయ్యబోయే సినిమాకి ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నాడు. సూపర్ స్టార్ స్టామినాని మ్యాచ్ చేసే లేడీ విలన్ ని రంగంలోకి దింపుతున్నాడు నెల్సన్.

Thalaivar169: మరోసారి రజినీతో ఐష్.. రోబో లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందా?

నెల్సన్ దిలీప్ కుమార్.. చేసింది 3 సినిమాలైనా తమిళ్ ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న పేరు. ముచ్చటగా మూడో సినిమానే.. స్టార్ హీరో విజయ్ తో చేసి హాట్ టాపిక్ అయ్యాడు నెల్సన్. తమిళ్ స్టార్ హీరో విజయ్ తో బీస్ట్ అనే మాస్ యాక్షన్ స్పై మూవీ చేసిన నెల్సన్.. ఈ సినిమాతో ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అంతేకాదు.. ఈ సినిమా టేకింగ్ విషయంలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అందుకే రజనీకాంత్ తో తను చేస్తున్న సినిమాకు ముందే జాగ్రత్త పడుతున్నాడు.

Rajinikanth: యంగ్ డైరెక్టర్లకి ఏరికోరి అవకాశాలిస్తున్న తలైవా.. ఫలితం ఫ్లాపులు!

నెల్సన్ తన నాలుగో మూవీ తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో అనౌన్స్ చేశారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇస్తున్న ఈసినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన నెల్సన్.. బీస్ట్ బొక్కబోర్లాపడడటంతో సినిమాకు కరెక్షన్స్ చెయ్యడంతో పాటు.. స్ట్రాంగ్ లేడీ విలన్ ని రంగంలోకి దింపుతున్నాడు. రజనీకాంత్ స్టేచర్ కి, క్రేజ్ కి తగినట్టు రమ్యకృష్ణను సినిమాలో యాడ్ చేస్తున్నట్టు టాక్.

Rajinikanth: ప్లాప్ దర్శకుడితో సూపర్ స్టార్.. అంత నమ్మకం ఏంటి ‘పెద్దన్నా’?

రమ్యకృష్ణ, రజనీకాంత్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన నరసింహ మూవీ సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. స్పెషల్లీ ఈ ఇద్దరి కెమిస్ట్రీ నెవర్ బిఫోర్ రేంజ్ లో సూపర్ సక్సెస్ అయ్యింది. రజనీకాంత్ కి ఎంత పేరొచ్చిందో, రమ్యకృష్ణ కు కూడా తన పర్ ఫామెన్స్ కి అంతపేరొచ్చింది. అందుకే మరోసారి నరసింహ లాంటి సినిమాను, రజనీకాంత్ లాంటి స్ట్రాంగ్ హీరోకి అంతకంటే స్ట్రాంగ్ విలన్ గా రమ్యకృష్ణ ను సెట్ చేసి సినిమామీద అంచనాలు తగ్గకుండా చూసుకుంటున్నారు నెల్సన్.