Bell Bottom : అక్షయ్ దెబ్బకి రూట్ మారుస్తున్న పాన్ ఇండియా సినిమాలు..

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ రిజల్ట్‌తో అప్‌కమింగ్ పాన్ ఇండియా సినిమాలు రూట్ మార్చుకుంటున్నాయి..

Bell Bottom : అక్షయ్ దెబ్బకి రూట్ మారుస్తున్న పాన్ ఇండియా సినిమాలు..

Bell Bottom

Bell Bottom: ఏడాదికి మినిమం మూడు రిలీజులు, వందల కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసే బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ దెబ్బకి అప్‌కమింగ్ పాన్ ఇండియా సినిమాల పరిస్థితి అయోమయంగా తయారైంది. వాయిదాల మీద వాయిదాల తర్వాత ఆగస్టు 19న భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైంది అక్షయ్ లేటెస్ట్ మూవీ ‘బెల్ బాటమ్’..

Celebrity Kids : క్యూట్ కిడ్స్.. మీమ్ మామూలుగా లేదుగా..!

అక్షయ్ కుమార్, వాణి కపూర్, హ్యూమా ఖురేషి లీడ్ రోల్స్ చేసిన మూవీ ‘బెల్ బాటమ్’.. రంజిత్ తివారి డైరెక్షన్లో, పూజా ఎంటర్‌టైన్‌మెంట్, ఎమ్మాయ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. పాండమిక్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అవుతున్న స్టార్ హీరో సినిమా కావడం, పైగా ప్రోమోస్ ప్రామిసింగ్‌గా ఉండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Bell Bottom : ఇందిరా గాంధీలా మారిన ఆ నటి ఎవరో తెలుసా..!

కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయ్యింది. బాక్సాఫీస్ బరిలో ‘బెల్ బాటమ్’ బొక్క బోర్లా పడింది. ఓవర్సీస్ సంగతి పక్కన పెడితే.. నార్త్‌లో ఓ మాదిరి కలెక్షన్స్ కూడా రాలేదు. పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ చేసినా.. జనాలు సినిమా చూడడానికి ధైర్యం చెయ్యకపోవడం కూడా ఒక కారణం అంటున్నారు. మల్టీప్లెక్సు‌ల్లో పరిస్థితి మరీ దారుణం. హైదరాబాద్‌ మల్టీప్లెక్సుల్లో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ సినిమా కలెక్షన్స్ అక్షయ్ ‘బెల్ బాటమ్’ కంటే ఎక్కువ అంటే Situation అర్థం చేసుకోవచ్చు.

Kartikeya : ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కార్తికేయ..!

ఇప్పుడు అక్షయ్ దెబ్బకి పాన్ ఇండియా సినిమాలు రూట్ మార్చుకుంటున్నాయి. అక్షయ్ లాంటి స్టార్ సినిమానే బాక్సాఫీస్ వద్ద ఇంత బ్యాడ్ రిపోర్ట్ రాబడితే.. భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా రేంజ్‌లో ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న మన సినిమాల పరిస్థితి ఏంటంటూ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు.

KGFChapter2: కేజీఎఫ్-2 రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్

సెప్టెంబర్‌లో అనుకున్న ‘కె.జి.యఫ్ 2’ ఏకంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌కి వెళ్లిపోయింది. క్రిస్మస్ రిలీజ్ అని అనౌన్స్ చేసిన ‘పుష్ప’ పార్ట్ 1 విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఏంటనేది తెలియదు. షూటింగ్ కంప్లీట్ అయినా అక్టోబర్ 13న రావడం కష్టమే. వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి అక్షయ్ సినిమా రిజల్ట్ కారణంగా రాబోయే పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ డేట్స్ మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Pushpa The Rise Part – 01 : ‘పుష్ప రాజ్’ క్రిస్మస్‌కి వస్తాండాడబ్బా..