Bellamkonda Ganesh: నేను స్టూడెంట్ సర్.. అందుకే వాయిదా..!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ హీరో నటించిన ‘స్వాతిముత్యం’ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో, తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా అందరూ మెచ్చే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక తాజాగా ఈ హీరో నటిస్తున్న ‘నేను స్టూడెంట్ సర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

Bellamkonda Ganesh: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ హీరో నటించిన ‘స్వాతిముత్యం’ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో, తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా అందరూ మెచ్చే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక తాజాగా ఈ హీరో నటిస్తున్న ‘నేను స్టూడెంట్ సర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

Bellamkonda Ganesh: స్కూటర్ ఎక్కిన స్వాతిముత్యం.. వచ్చేది ఎప్పుడంటే?

ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. కాగా, ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌‌గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ సినిమాను మార్చి 10న రిలీజ్ చేయడం లేదని చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.

Bellamkonda Ganesh : ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఢీ కొడతా అంటున్న బెల్లంకొండ డెబ్యూ హీరో

విద్యార్థులకు మార్చిలో పరీక్షలు ఉండటంతో, వారిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదని.. వారు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను మార్చి 10న రిలీజ్ చేయడం లేదని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఇక విద్యార్థులు పరీక్షలు ముగించుకున్న తరువాత ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్ కూడా ఓ విద్యార్థిగా కనిపిస్తుండగా, రాఖి ఉఫ్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసాని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. మహతి స్వర సాగర్, అనిత్ మదడి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ‘నాంది’ సతీష్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు