ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ – వినాయక్, బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ

10TV Telugu News

Chatrapathi Hindi Remake: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డా.జయంతి లాల్ గడా నిర్మిస్తున్నారు.https://10tv.in/nothing-but-malice-in-law-kanganas-house-demolition/
డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీలో అభిమానులను సంపాదించుకున్న బెల్లంకొండ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు.
అలాగే ‘అల్లుడు శీను’ సినిమాతో సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన మాస్ డైరెక్టర్ వినాయక్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ను రూపొందించనున్నారు. వీరిద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కావడం విశేషం.Bellamkonda Sai Sreenivasఈ సినిమా కోసం బెల్లంకొండ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. ఒరిజినల్ వెర్షన్‌కు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సెకెండాఫ్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. ఇంతకుముందు ఆయన ‘బజరంగీ భాయ్‌జాన్’, ‘మణికర్ణిక’ వంటి బాలీవుడ్ చిత్రాలకు కథ అందించారు.