Bellamkonda Sreenivas: ఓటీటీలో కాదు.. థియేటర్స్‌లోనే హిందీ ‘ఛత్రపతి’ ల్యాండ్ అవుతాడట!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేస్తుండగా, ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. మాస్ చిత్రాల దర్శకుడు వివి.వినాయక్ ఈ రీమేక్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే షూటింగ్ పనులు కూడా ముగించుకున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

Bellamkonda Sreenivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేస్తుండగా, ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. మాస్ చిత్రాల దర్శకుడు వివి.వినాయక్ ఈ రీమేక్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే షూటింగ్ పనులు కూడా ముగించుకున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
Bellamkonda Sreenivas: హిందీ ‘ఛత్రపతి’ అప్పుడే వస్తాడా..?
అయితే ఈ సినిమాపై బాలీవుడ్‌లో అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ కావడం లేదని భావించిన చిత్ర యూనిట్, ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా ఈ సినిమా రిలీజ్ అనుకున్న సమయానికి కాలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా, ఈ సినిమాను ఓటీటీలో కాకుండా, నేరుగా థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని చిత్ర దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోందట.
Bellamkonda Sreenivas: పవన్ డైరెక్టర్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ.. నిజమేనా?
దీంతో ఈ సినిమాను బాలీవుడ్ జనంలోకి తీసుకెళ్లాలంటే, బెల్లంకొండ శ్రీనివాస్ బాగా కష్టపడాల్సి ఉందని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఈ సినిమాకు విస్తృతంగా ప్రమోషన్స్ చేస్తేనే ఈ సినిమా జనంలోకి వెళ్తుందని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ ఏమిటనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో క్రియేట్ అయ్యింది.