Bellamkonda Sreenivas : పవన్ కళ్యాణ్ డైరెక్టర్‌తో బెల్లంకొండ కొత్త సినిమా..
బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) శ్రీరామనవమి సందర్భంగా తన కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శకుడిని రంగంలోకి దింపుతున్నాడు.

Bellamkonda Sreenivas movie with pawan kalyan director Saagar K Chandra
Bellamkonda Sreenivas : టాలీవుడ్ లో నిర్మాత వారసుడిగా పరిచమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas). అల్లుడు శీను సినిమాతో 2014 లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. చేసింది 9 సినిమాలే అయినా దాదాపు టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్స్ తోనే పని చేశాడు. ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. ఈ డెబ్యూట్ కోసం టాలీవుడ్ కి తనని పరిచయం చేసిన వి వి వినాయక్ నే నమ్ముకున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మే 12న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది.
Jaya Janaki Nayaka : ‘జయ జానకి నాయక’ సినిమాతో వరల్డ్ రికార్డు సృష్టించిన హీరో బెల్లంకొండ..
ఇక నేడు (మార్చి 30) శ్రీరామనవమి సందర్భంగా తన కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శకుడిని రంగంలోకి దింపుతున్నాడు. రీసెంట్ గా భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాతో పవన్ ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చిన సాగర్ కే చంద్ర (Saagar K Chandra) ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో పోలీస్ క్వార్టర్స్ కనిపిస్తున్నాయి. ఒక డైనమిక్ పర్సన్ యొక్క పవర్ ఫుల్ స్టోరీ అని కూడా కామెంట్ రాసుకొచ్చారు. దీనిబట్టి బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి ఖాకి డ్రెస్ వేయబోతున్నట్లు తెలుస్తుంది.
Chatrapathi Remake: సమ్మర్‌లో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ‘ఛత్రపతి’
గతంలో కవచం, రాక్షసుడు సినిమాల్లో బెల్లంకొండ పోలీస్ పాత్రలో కనిపించాడు. ఇక బాలకృష్ణ, మహేష్ బాబులతో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన 14 రీల్స్ పతాకం పై రామ్ అచంట, గోపి అచంట ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. కాగా బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్టూవర్ట్‌పురం దొంగ’ అనే సినిమాని గతంలో అనౌన్స్ చేశాడు. అయితే సేమ్ కథతో రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ని ప్రకటించాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ప్రకటించిన ‘స్టూవర్ట్‌పురం దొంగ’ ప్రాజెక్ట్ ఉందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
A Powerful Story of a Dynamic Man 🔥@BSaiSreenivas‘s next to be directed by the MASSively talented @saagar_chandrak ❤️🔥
Produced by @RaamAchanta & #GopiAchanta under @14ReelsPlus 🔥#BSS10 pic.twitter.com/mzFtfM61NM
— 14 Reels Plus (@14ReelsPlus) March 30, 2023