Naatu Naatu Song : నాటు నాటుకు ఆస్కార్ వస్తుందా? రాదా? టాలీవుడ్ లో కోట్లల్లో బెట్టింగ్..

నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వస్తుందా రాదా అని టాలీవుడ్ లో బెట్టింగ్ లు వేసుకుంటున్నారట. మొదటిసారి ఒక తెలుగు సినిమా నుంచి ఒక పాట ఆస్కార్ దాకా వెళ్లడంతో ప్రేక్షకులు, సినీ ప్రేమికులు అందరూ చాలా ఆసక్తిగా ఆస్కార్ అవార్డుల కోసం..............

Naatu Naatu Song : నాటు నాటుకు ఆస్కార్ వస్తుందా? రాదా? టాలీవుడ్ లో కోట్లల్లో బెట్టింగ్..

Betting crores in Tollywood whether Natu Natu song will get Oscar or not

Naatu Naatu Song :  మరికొద్ది గంటల్లో ఆస్కార్ వేడుక జరగబోతుంది. ప్రపంచ సినీ ప్రేమికులంతా ఈ అవార్డు వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా ఉంది. దీనితో పాటు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ ది బ్రీత్స్ సినిమాలు కూడా ఇండియా నుంచి నామినేషన్స్ లో నిలిచాయి. ఈ మూడు కూడా ఆస్కార్ అవార్డులు సాధించాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.

అయితే నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వస్తుందా రాదా అని టాలీవుడ్ లో బెట్టింగ్ లు వేసుకుంటున్నారట. మొదటిసారి ఒక తెలుగు సినిమా నుంచి ఒక పాట ఆస్కార్ దాకా వెళ్లడంతో ప్రేక్షకులు, సినీ ప్రేమికులు అందరూ చాలా ఆసక్తిగా ఆస్కార్ అవార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. మన దగ్గర క్రికెట్ కి భారీగా బెట్టింగ్ లు జరుగుతాయని తెలిసిందే. అప్పుడప్పుడు ఎలక్షన్స్ టైంలోను, సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఏ పార్టీ గెలుస్తుంది? సినిమా హిట్ అవుతుందా లేదా అని బెట్టింగ్ లు జరుగుతుంటాయి.

Naatu Naatu Song : నాటు నాటు.. సాహిత్యం, ఫోక్ రెండూ కలిపి.. నాటు నాటు సాంగ్ చంద్రబోస్ పెన్ నుంచి జనాల మదిలోకి.. పాట లిరిక్స్ ఇవే..

అలాగే ఇప్పుడు RRR నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వస్తుందా రాదా అని టాలీవుడ్ లో బెట్టింగ్ లు వేసుకుంటున్నారు. ఆడియన్స్ మాత్రమే కాక పలు నిర్మాతలు, టాలీవుడ్ లోని టెక్నీషియన్స్ కూడా ఈ విషయంలో బెట్టింగ్స్ వేస్తున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆస్కార్ దాకా వెళ్లి సరికొత్త చరిత్రలు సృష్టిస్తున్నారని ఓ పక్క గర్వపడుతుంటే మరోపక్క ఇలా బెట్టింగ్ లు వేయడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇది చూసి మరికొంతమంది జనాలు కూడా బెట్టింగ్స్ వేస్తున్నారట. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సోషల్ మీడియాలో, బయట ఎక్కడ చూసినా నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వస్తుందా రాదా అనే చర్చలే జరుగుతున్నాయి. నాటు నాటుకి ఆస్కార్ వస్తుందా రాదా తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.