భారత్- మోషన్ పోస్టర్

సల్మాన్ ఖాన్ భారత్- మోషన్ పోస్టర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : April 20, 2019 / 10:00 AM IST
భారత్- మోషన్ పోస్టర్

సల్మాన్ ఖాన్ భారత్- మోషన్ పోస్టర్ రిలీజ్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా, గుల్షన్ కుమార్ అండ్ టి-సిరీస్ సమర్పణలో, సల్మాన్ ఖాన్ ఫిలింస్ అండ్ రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి.ఫిలిం బ్యానర్‌పై, అతుల్ అగ్నిహోత్రి, అల్విర ఖాన్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ అండ్ కృష్ణ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ, భారత్.. జర్నీ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ ఏ నేషన్ టు గెదర్ అనేది ట్యాగ్ లైన్.. ఇంతకుముందు సల్మాన్‌తో సుల్తాన్, టైగర్ జిందాహై సినిమాలు చేసిన అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న భారత్ మూవీ మోషన్ పోస్టర్ రీసెంట్‌గా రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

1964, 1970, 1985, 1990, 2010 సంవత్సరాల్లో సల్మాన్ వివిధ రకాల గెటప్స్‌తో రూపొందించిన మోషన్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఇండియా, పాకిస్థాన్ సరిహద్దు నేపథ్యంలో, మానవ బంధాలకు పెద్దపీటవేస్తూ రూపొందిస్తున్న భారత్.. ఈద్ కానుకగా జూన్ 5 న రిలీజ్ కానుంది.. టబు, జాకీ ష్రాఫ్, దిశా పటానీ, సోనాలీ కులకర్ణి, సునీల్ గ్రోవర్, నోరా ఫతేహి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : విశాల్-శేఖర్.

వాచ్ భారత్ మోషన్ పోస్టర్..