సల్మాన్ ఖాన్ భారత్ – ట్రైలర్

భారత్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : April 22, 2019 / 10:05 AM IST
సల్మాన్ ఖాన్ భారత్ – ట్రైలర్

భారత్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్‌లో..గుల్షన్ కుమార్ అండ్ టి-సిరీస్ సమర్పణలో, సల్మాన్ ఖాన్ ఫిలింస్ అండ్ రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి.ఫిలిం బ్యానర్‌పై, అతుల్ అగ్నిహోత్రి, అల్విర ఖాన్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ అండ్ కృష్ణ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ, భారత్.. జర్నీ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ ఏ నేషన్ టు గెదర్ అనేది ట్యాగ్ లైన్.. టబు, జాకీ ష్రాఫ్, సోనాలీ కులకర్ణి, సునీల్ గ్రోవర్, నోరా ఫతేహి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దిశా పటానీ మరో హీరోయిన్‌‌గా నటిస్తుంది. రీసెంట్‌గా భారత్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

సల్మాన్ అయిదు ఢిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనుండగా, కత్రినా గవర్నమెంట్ ఆఫీసర్‌గా కనిపించనుంది. సల్మాన్ ఉద్యోగం కోసం కత్రినా పనిచేస్తున్న ఆఫీసుకి వెళ్ళినప్పుడు, ఆమె, సల్మాన్‌ని పేరు అడిగితే, సల్మాన్.. భారత్ అని చెప్పగానే ఆమె షాక్ అవడం బాగుంది. సల్మాన్ గెటప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. సుల్తాన్, టైగర్ జిందాహై సినిమాల తర్వాత అలీ అబ్బాస్, సల్మాన్‌ల కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. భారత్ రంజాన్ కానుకగా జూన్ 5 న రిలీజ్ కానుంది..  

వాచ్ ట్రైలర్..