సల్లూ భాయ్ సినిమాలో ‘ప్రేమిస్తే’ భరత్

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంటగా నటిస్తున్న ‘రాధే’.. (యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్).. మూవీలో కీలక పాత్రలో కనిపించనున్న భరత్..

  • Edited By: sekhar , November 9, 2019 / 05:58 AM IST
సల్లూ భాయ్ సినిమాలో ‘ప్రేమిస్తే’ భరత్
ad

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంటగా నటిస్తున్న ‘రాధే’.. (యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్).. మూవీలో కీలక పాత్రలో కనిపించనున్న భరత్..

‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబోలో తెరకెక్కనున్న మూవీ.. ‘రాధే’.. (యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్).. ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు షూటింగ్‌కు కొబ్బరికాయ కూడా కొట్టారు. సల్మాన్ సరసన దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం తమిళ యువ నటుడు భరత్‌ను ఎంపిక చేశారు..

‘యువసేన’ (ఫర్ ది పీపుల్), ‘బాయ్స్’ ‘ప్రేమిస్తే’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భరత్.. తమిళనాట హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.. ‘స్పైడర్’ సినిమాలో ఎస్.జె.సూర్య తమ్ముడిగా కనిపించిన భరత్.. సల్మాన్ ఖాన్ ‘రాధే’లో భరత్ విలన్‌గా కనిపించనున్నాడని బాలీవుడ్ టాక్..

Read Also : కేరళలో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ సందడి

ఈ సందర్భంగా ‘సల్మాన్‌ భాయ్‌తో కలిసి నటించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి, అవకాశం కల్పించిన ప్రభుదేవాగారికి థ్యాంక్స్‌’ అంటూ సల్మాన్, ప్రభుదేవాలతో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు భరత్.. సల్మాన్ ఖాన్ ఫిలింస్, సోహైల్ ఖాన్ ప్రొడక్షన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి. సంస్థలు  నిర్మిస్తున్న ‘రాధే’.. 2020 ఈద్ కానుకగా విడుదల చెయ్యనున్నారు. ‘దబాంగ్ 3’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజవుతోంది.