Pawan Kalyan : హరీష్ శంకర్ నుంచి ‘భవదీయుడు భగత్ సింగ్’ అప్డేట్

ఇటీవల పవన్ వరుస సినిమాలు అనౌన్స్ చేయడంతో హరీష్ శంకర్ తో కూడా సినిమా అనౌన్స్ చేశారు. దీంతో పవన్ అభిమానులు సంబరపడిపోయారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి హరీష్ శంకర్..............

Pawan Kalyan :  హరీష్ శంకర్ నుంచి ‘భవదీయుడు భగత్ సింగ్’ అప్డేట్

Pawan Kalyan

 

Hareesh Shankar :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘గబ్బర్ సింగ్’ సినిమా. ఈ సినిమా పవన్ అభిమానులకు కొత్త ఊపునిచ్చింది. పవన్ ని ఎలా చూడాలి అనుకున్నారో ఆయన అభిమానులకు డైరెక్టర్ హరీష్ శంకర్ అలా చూపించారు. ఈ సినిమా తర్వాత పవన్ రేంజ్ అమాంతం పెరిగింది. దీనికి ఒక రకంగా కారణం హరీష్ శంకర్ కూడా.

ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా వస్తే బాగుండు అని పవన్ అభిమానులు అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇటీవల పవన్ వరుస సినిమాలు అనౌన్స్ చేయడంతో హరీష్ శంకర్ తో కూడా సినిమా అనౌన్స్ చేశారు. దీంతో పవన్ అభిమానులు సంబరపడిపోయారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Lata Mangeshkar : నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా లతా మంగేష్కర్

ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ‘భవదీయుడు భగత్ సింగ్’ అని టైటిల్ తో పాటు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని పవన్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో హరీష్ శంకర్ ని అడుగుతున్నారు.

Vishnu Vishal : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో విష్ణు విశాల్, గుత్తా జ్వాలా

దీంతో తాజాగా హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా గురించి ఓ వాయిస్ ఓవర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వాయిస్ ఓవర్ లో.. ”చాలా మంది ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా అప్డేట్స్ అడుగుతున్నారు. సినిమాలో టైమింగ్ ఎంత ముఖ్యమో, సినిమాకి టైమింగ్ కూడా అంతే ముఖ్యం అని నమ్ముతున్నాను. త్వరలో అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సినిమాకి సంబంధించిన పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. మీ సపోర్ట్ కి, మీ సహనానికి చాలా థ్యాంక్స్” అని తెలిపారు. దీంతో ఈ సారి కూడా గబ్బర్ సింగ్ మించిన హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.