RRR Trailer: భీమ్-రామ్ వచ్చేస్తున్నారు.. ట్రైలర్‌ ముంగిట కళ్లుచెదిరే సర్‌ప్రైజ్‌లు!

దర్శక దిగ్గజం రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో..

10TV Telugu News

RRR Trailer: దర్శక దిగ్గజం రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ లు అందుకోగా ఇప్పుడు రాబోయే ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో ఉండనుందోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కిన సినిమా కూడా ఇదే కావడంతో అటు మెగా అభిమానులది అదే పరిస్థితి.

Salaar: క్రేజీ టాక్.. భారీ స్థాయిలో ఇంటర్వెల్ సీక్వెన్స్ రీషూట్?

ఈ ఇద్దరి స్టార్ హీరోలతో కలిసి క్రేజీ పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా RRR (రౌద్రం రణం రుథిరం). జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మరో మూడు రోజులలో ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మూడు రోజుల క్రితమే రావాల్సిన ఈ ట్రైలర్ లిరికల్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో వాయిదా పడగా డిసెంబర్ 9న ట్రైలర్ బయటకి రానుంది.

Samantha: చైతూతో డైవర్స్‌పై తొలిసారి స్పందించిన సామ్!

మరో మూడు రోజులలో భీమ్ వచ్చేస్తున్నాడంటూ తారక్ ట్విట్టర్ హ్యాండిల్ కౌన్ డౌన్ మొదలు పెట్టగా.. ఎన్టీఆర్ కు సంబంధించి కొత్త పోస్టర్ కూడా ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భీమ్ గా తారక్ ఫిటెన్స్ బాడీతో భారీ తాళ్లను లాగుతున్న ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి పిక్ ఒక్కటే ఇలా ఉంటే ఇక ట్రైలర్ ఆ స్థాయిలో ఉంటుందో.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని చర్చలు సాగుతున్నాయి.

×