Bheemla Nayak : పండుగ రోజు ‘అంత ఇష్టం’

దసరా రోజు ‘భీమ్లా నాయక్’ సినిమాలోని సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చెయ్యనున్నారు..

Bheemla Nayak : పండుగ రోజు ‘అంత ఇష్టం’

Bheemla Nayak

Bheemla Nayak: ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Bheemla Nayak : నీ మొగుడు ‘గబ్బర్ సింగ్’ అంట..! రానా దగ్గుబాటి డైలాగ్ ప్రోమో

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పవన్ గ్లింప్స్, టైటిల్ సాంగ్‌కి, అలాగే డానియెల్ శేఖర్ గా రానా ఇంట్రో వీడియోకి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే.

Sai Dharam Tej : అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించిన సాయి ధరమ్ తేజ్ సినిమాలు..

మంగళవారం ‘భీమ్లా నాయక్’ నుంచి సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లుగా ఓ అప్‌డేట్ ఇచ్చింది టీం. అక్టోబర్ 15న దసరా కానుకగా ఈ సినిమాలోని ‘అంత ఇష్టం’ అనే సెకండ్ సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పవన్, నిత్యా మీనన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. రానా భార్యగా కన్నడ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తుంది.

Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!