F3 Movie: భీమ్లా దెబ్బ.. వాయిదా పడిన ఎఫ్-3!

A వచ్చి Bపై వాలే.. B వచ్చి Cపై వాలే అన్నట్లుగా అయిపొయింది తెలుగు సినిమాల విడుదల పరిస్థితి. ఆర్ఆర్ఆర్ ఒక్క సినిమా చాలా సినిమాల విడుదలపై ప్రభావం పడుతుంది.

F3 Movie: భీమ్లా దెబ్బ.. వాయిదా పడిన ఎఫ్-3!

F3 Movie

F3 Movie: A వచ్చి Bపై వాలే.. B వచ్చి Cపై వాలే అన్నట్లుగా అయిపొయింది తెలుగు సినిమాల విడుదల పరిస్థితి. ఆర్ఆర్ఆర్ ఒక్క సినిమా చాలా సినిమాల విడుదలపై ప్రభావం పడుతుంది. నిజానికి ఈ క్రిస్టమస్ నుండి వచ్చే ఏడాది సమ్మర్ వరకు చాలా మంది దర్శక, నిర్మాతలు తమ తమ సినిమాలను తెచ్చేందుకు డేట్స్ సెట్ చేసుకున్నారు. కానీ.. మధ్యలో ఆర్ఆర్ఆర్ సంక్రాంతి వచ్చి చేరడంతో జనవరి సినిమాల పరిస్థితి డైలమాలో పడింది. మెల్లగా ఒక్కొక్కరు సంక్రాంతి నుండి తప్పుకొని ఆర్ఆర్ఆర్ కు సైడిచ్చేశారు.

Sonarika Bhadoria: అందాల జాదూ చేస్తున్న హాట్ లేడీ సోనారికా!

ముందుగా వచ్చే సంక్రాంతికి సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, రాధే శ్యామ్, బంగార్రాజు, ఎఫ్-3 ఇలా అరడజనుకు పైగా సినిమా రావాలనుకున్నాయి. అయితే, ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ ప్రకటన వచ్చిందో సర్కారు వారి పాట, బంగార్రాజు, ఎఫ్-3 అన్నీ సర్దుకున్నాయి. రాధేశ్యామ్ ఒక్కటే బరిలో ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా తప్పుకొని ఫిబ్రవరి 24కు వాయిదా వేసుకున్నారు. సంక్రాంతి ఫైట్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మధ్య మాత్రమేనని ఫైనల్ అయిపొయింది.

OTT Releases: తగ్గేదేలే.. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

కాగా, భీమ్లా నాయక్ వాయిదా పడి కొత్త డేట్ కూడా ఒకేసారి ఇచ్చేశారు. ఫిబ్రవరి 24న భీమ్లా నాయక్ సినిమా తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే, అప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ-వరుణ్ ల ఎఫ్-3 ఫిబ్రవరి 25 విడుదల ప్లాన్ చేసుకుని ప్రకటించారు. భీమ్లా నాయక్ కొత్త డేట్ తో ఎఫ్-3కి కష్టాలొచ్చాయి. సమ్మర్‌కు రిలీజ్‌ చేయబోతున్నామంటూ తాజా విడుదల తేదీని ప్రకటించారు. నవ్వల పండగ వచ్చే ఏడాది సమ్మర్‌లో అంటూ ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు విడుదల తేదీని వెల్లడించారు.