Bheemla Nayak: సంక్రాంతికి రావాలా వద్దా..? చర్చిస్తున్న భీమ్లా నాయక్ మేకర్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మాస్ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కూడా ఒకటి. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై..

Bheemla Nayak: సంక్రాంతికి రావాలా వద్దా..? చర్చిస్తున్న భీమ్లా నాయక్ మేకర్స్?

Bheemla Nayak

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మాస్ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కూడా ఒకటి. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఒక్కో అప్డేట్స్ తో మేకర్స్ అంతకు మించిన హైప్ తీసుకురవడంతో సినిమాపై హీట్ పెరుగుతూ వచ్చింది. అందుకు తగ్గట్లే మేకర్స్ కూడా సాధ్యమైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వచ్చే సంక్రాంతికి డేట్ ఇచ్చేశారు.

RRR: ముంబైలో బ్లాస్టింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సర్వం సిద్ధం!

సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఎప్పటికప్పుడు కట్టుబడి ఉన్నట్లుగా ప్రకటిస్తూనే ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం వాయిదా ప్రచారం ఆగడమే లేదు. దానికి ప్రధాన కారణం ప్రకటించిన విడుదల తేదీకి ఇరవై రోజులే సమయం ఉండగా ప్రస్తుతం సినిమా ఇంకా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సినిమా ప్రమోషన్స్ చేపట్టాల్సి ఉంది.

Pooja Hegde : వరుస బికినీ ఫొటోలతో హీటేక్కిస్తున్న బుట్టబొమ్మ

నిన్నటి వరకు నిర్మాత నాగవంశీ జనవరి 12న విడుదల గ్యారంటీ అని ధీమాగా చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు వెనక్కి తగ్గాలా ముందుకు వెళ్లాలా అన్న డైలమాలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. గత వారం రిలీజైన పుష్ప సినిమాను కూడా హడావుడిగా రిలీజ్ చేశారనే విమర్శలు వచ్చాయి. అందుకే, దీనిపై మరోసారి చర్చల అనంతరం మేకర్స్ నుండి క్లారిటీ రానుందని తాజా టాక్ నడుస్తుంది. మరి అనుకున్నట్లే జనవరిలో వస్తాడా.. లేక వాయిదా వేసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.