నా లవ్ విజయ్ మాల్యా లాంటిది.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘భీష్మ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు..

  • Edited By: sekhar , November 7, 2019 / 04:46 AM IST
నా లవ్ విజయ్ మాల్యా లాంటిది.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘భీష్మ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు..

నితిన్, రష్మిక జంటగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్.. ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).. పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘భీష్మ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు..

‘నా లవ్ విజయ్ మాల్యా లాంటిదిరా.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం’.. అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ బాగుంది.. రష్మిక నడుము చూస్తూ ఆమెని ఫాలో అవడం, ఆమె తన వైపు తిరగ్గా నడుమును పట్టుకోబోతూ.. చింపేశారు అన్నట్టు నితిన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయి.. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ని స్ఫూర్తిగా తీసుకున్నాడేమో కానీ అచ్చు అదే స్టైల్‌లో మ్యాజిక్ చేశాడు నితిన్..

Read Also : నాలుగు భాషల్లో ‘దర్బార్’ మోషన్ పోస్టర్ రిలీజ్

నితిన్ మేకోవర్, హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా సెట్ అయ్యాయి.. 2020 ఫిబ్రవరి 21న ‘భీష్మ’ విడుదల కానుంది.. నరేష్, సంపత్, రఘబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : మహతి స్వరసాగర్, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : సాహి సురేష్.