త్రివిక్రమ్ అతిథిగా.. నితిన్ హిట్ కొడతాడా..

నితిన్, కన్నడ చిన్నది రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్) ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా త్రివిక్రమ్..

  • Published By: sekhar ,Published On : February 16, 2020 / 08:47 AM IST
త్రివిక్రమ్ అతిథిగా.. నితిన్ హిట్ కొడతాడా..

నితిన్, కన్నడ చిన్నది రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్) ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా త్రివిక్రమ్..

యంగ్ హీరో నితిన్, కన్నడ చిన్నది రష్మిక జంటగా.. ‘ఛలో’ మూవీతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరి ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్)..

ఇటీవల విడుదల చేసిన టీజర్.. ‘వాట్టే బ్యూటీ’, ‘సింగిల్ యాంథెమ్’ సాంగ్స్‌‌తో పాటు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ‘సింగిల్స్ యాంథెమ్’ వీడియో సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. తాజాగా ‘భీష్మ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలు ప్రకటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అఆ’ తర్వాత నితిన్‌ హిట్ ముఖం చూడనేలేదు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి త్రివిక్రమ్ అతిథిగా వస్తేనైనా సెంటిమెంట్‌గా హిట్ వస్తుందేమో చూడాలి మరి. ఫిబ్రవరి 17వ తేది సాయంత్రం హైదరాబాద్, యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. అదేరోజు సాయంత్రం 4:05 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 21న భీష్మ ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.

Bheeshma - Trailer