Bheemla Nayak: థియేటర్లలో భీమ్లా నాయక్.. మొదటి రోజే 10 వేలకు పైగా షోలు

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద హంగామా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా భీమ్లా నాయక్‌ మానియా కనిపిస్తోంది. టాలీవుడ్‌కు భీమ్లా నాయక్‌ ఫీవర్ పట్టేసింది. ప

Bheemla Nayak: థియేటర్లలో భీమ్లా నాయక్.. మొదటి రోజే 10 వేలకు పైగా షోలు

Bheemla Nayak

Bheemla Nayak: తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద హంగామా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా భీమ్లా నాయక్‌ మానియా కనిపిస్తోంది. టాలీవుడ్‌కు భీమ్లా నాయక్‌ ఫీవర్ పట్టేసింది. పవన్‌ సినిమాను ఫస్ట్‌ రోజు ఫస్ట్‌ షోలోనే చూడాలంటున్నారు పవర్‌ ఫ్యాన్స్‌. అందుకే.. బెనిఫిట్ షోలకు ఎగబడ్డారు. ఏపీలో బెనిఫిట్‌ షోలకు అనుమతి లేకపోవడంతో.. అక్కడి నుంచి ఫ్యాన్స్ భారీగా తెలంగాణకు వచ్చారు. బోర్డర్‌కు దగ్గర్లో ఉన్న థియేటర్లకు పోటెత్తారు.

తెలంగాణలో ఎక్కడెక్కడ బెనిఫిట్‌ షో వేస్తున్నారో తెలుసుకుని మరీ టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఇక మొన్న జరిగిన భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సైతం ఏపీ నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారంతా హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. భీమ్లా నాయక్‌ బెనిఫిట్‌ షోకు టిక్కకెట్లు భారీగా బుక్‌ చేసుకున్నారు.

దీంతో అర్థరాత్రి నుంచే థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివచ్చిన పవన్‌ ఫ్యాన్స్‌… అక్కడ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. పవర్‌ స్టార్‌ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. కేక్‌లు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

వరల్డ్‌ వైడ్‌గా పవర్‌ స్టార్ సినిమా భీమ్లానాయక్‌ రిలీజ్‌ అయ్యింది. దీంతో.. ఫ్లెక్సీలు, బ్యానర్లు, పవన్‌ కటౌట్స్‌ను ఏర్పాటు చేశారు అభిమానులు. తగ్గేదే లేదంటూ రిలీజ్‌కు ముమ్మర ఏర్పాట్లు చేశారు. భారీ అంచనాలతో.. బాక్సాఫీస్‌ను దున్నేద్దాం అన్నట్లు భీమ్లా దూసుకువస్తున్నాడు. దీంతో.. అందుకు తగ్గ రేంజ్‌లో ఏర్పాట్లు చేశారు పవర్‌ ఫ్యాన్స్.

ప్రపంచ వ్యాప్తంగా.. సుమారు 3 వేలకు పైగా థియేటర్లలో భీమ్లా నాయక్‌ సందడి చేస్తున్నాడు. మొదటి రోజే బెనిఫిట్‌ షోలతో కలుపుకుని.. 10 వేలకు పైగా షోలు పడనున్నాయి. కేవలం హైదరాబాద్‌లోనే 120 థియేటర్లలో భీమ్లా నాయక్‌ రిలీజ్‌ కానుండగా.. వెయ్యి షోలు పడే చాన్స్‌ ఉంది. తెలంగాణలో తెల్లవారుజామున 4 గంటలకే బెనిఫిట్‌ షోలు మొదలయ్యాయి.

తెలుగు స్టేట్సే కాదు… దేశవ్యాప్తంగా భీమ్లా నాయక్‌ మానియా కనిపిస్తోంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో హాట్‌ కేకుల్లా.. భీమ్లా నాయక్‌ టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అటు.. ఓవర్సీర్‌లోనూ దుమ్ము దులిపేందుకు రెడీ అయ్యాడు పవర్‌ స్టార్‌. అమెరికా, ఆస్ట్రేలియాలో రికార్డు స్థాయి బుకింగ్స్‌ జరిగినట్లు సమాచారం.

మరోవైపు.. భీమ్లా నాయక్‌పై ఏపీలో వివాదం నడుస్తోంది. నాలుగు ఆటలు దాటొద్దు.. టికెట్లను ఎక్కువ రేట్లకు అమ్మొద్దంటూ రెవెన్యూ శాఖ అధికారులు థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. తేడా వస్తే హాలు మూసేస్తాం అంటూ హెచ్చరించారు. మరోవైపు.. థియేటర్లపై ఏపీ రెవెన్యూ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తగ్గించిన రేట్లకే టికెట్లు అమ్మాలంటూ సర్కార్ ఆదేశాలిచ్చింది. కొత్త జీవో అప్పుడే అమల్లోకి రాలేదని.. పాత జీవోనే ఫాలో కావాలంటూ క్లారిటీ ఇచ్చింది.