Bholaa Movie: ‘ఖైదీ’ మూవీకి డిట్టో కాదు.. చాలా మార్పులు చేసిన అజయ్ దేవ్గన్!

తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘ఖైదీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాలో కార్తి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని యాక్షన్, డ్రామా ప్రేక్షకులను అమితంగా అలరించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో హీరో అజయ్ దేవ్గన్ తెరకెక్కిస్తున్నాడు. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Bholaa Movie: ‘ఖైదీ’ మూవీకి డిట్టో కాదు.. చాలా మార్పులు చేసిన అజయ్ దేవ్గన్!

Bholaa Movie Trailer Raises Curiosity In Audiences

Bholaa: తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘ఖైదీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాలో కార్తి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని యాక్షన్, డ్రామా ప్రేక్షకులను అమితంగా అలరించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో హీరో అజయ్ దేవ్గన్ తెరకెక్కిస్తున్నాడు. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Bholaa : ఖైదీ బాలీవుడ్ రీమేక్ భోళా.. రిలీజ్ అవ్వకముందే విమర్శలు..

ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే, ఖైదీ సినిమా స్టోరీలైన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, సినిమాలో చాలా వరకు మార్పులు చేశాడు అజయ్ దేవ్గన్. పోలీస్ ఆఫీసర్ పాత్రలో టబు, హీరోయిన్‌గా అమలా పాల్ వంటి పాత్రలను కొత్తగా యాడ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Ajay Devgn Bholaa : అజయ్ దేవగన్ ‘ఖైదీ’ రీమేక్‌లో.. విలన్‌గా జూనియర్ బచ్చన్..

ఇక యాక్షన్‌కు ఏమాత్రం కొదువ లేకుండా చిత్ర యూనిట్ చూసుకుంది. ఈ సినిమాను అజయ్ దేవ్గన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.