ట్రైలర్ చూసి భయపడకుండా ఉంటే.. మీరు ధైర్యవంతులే!

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హారర్ మూవీ ‘భూత్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 3, 2020 / 11:07 AM IST
ట్రైలర్ చూసి భయపడకుండా ఉంటే.. మీరు ధైర్యవంతులే!

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హారర్ మూవీ ‘భూత్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

 ‘ఉరి : ది సర్జికల్ స్ట్రెక్స్’ సూపర్ హిట్ అవడంతో బాగా పాపులర్ అయ్యాడు బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్.. ఈ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ సైతం గెల్చుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త జానర్‌లో నటిస్తున్నాడు విక్కీ.. ధర్మా ప్రొడక్షన్స్ సమర్పణలో, హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, శశంకా కైతాన్ నిర్మిస్తున్న హారర్ చిత్రం.. ‘భూత్ : పార్ట్ వన్. హాంటెడ్ షిప్’..

తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. సీ బర్డ్ అనే షిప్ ఒకటుంటుంది. దాని వెనుక చాలా పెద్ద కథే ఉంటుంది. కట్ చేస్తే ఆ షిప్పే దెయ్యాలకు నెలవు అవుతుంది. ఎంటర్ ది డ్రాగన్ టైపులో పొరపాటున ఎవరైనా ఆ షిప్‌లోకి అడుగు పెట్టారో.. ఇక అంతే సంగతులు.. వాళ్లకి తమ విశ్వరూపం చూపిస్తాయి సదరు దెయ్యాలు.

విక్కీ మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా సెట్ అయ్యాయి. ఫిబ్రవరి 21న ‘భూత్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాటోగ్రఫీ : పుష్కర్ సింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ : కేతన్ సోధ, మ్యూజిక్ : అఖిల్ సచ్‌దేవ.