Manchu Manoj – Bhuma Mounika : పెళ్లి కాకముందు మౌనికని మోహన్ బాబు అలా ట్రీట్ చేసేవారు.. ఇప్పుడు!
మనోజ్ అండ్ మౌనిక పెళ్ళికి మోహన్ బాబు మొదటిలో ఒప్పుకోలేదంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా మౌనిక.. పెళ్లి కాకముందు మోహన్ బాబు తనని ఎలా ట్రీట్ చేసేవాడో చెప్పుకొచ్చింది.

Bhuma Mounika comments on mohan babu
Manchu Manoj – Bhuma Mounika : మంచు వారసుడు మనోజ్, భూమా వారసురాలు మౌనిక ప్రేమ పెళ్లి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆల్రెడీ విడివిడిగా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న మనోజ్ అండ్ మౌనిక.. కలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుండడం మీడియా అండ్ సోషల్ నెట్ వర్క్స్ పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ ప్రేమ వార్తలు పై వీరిద్దరి చాలా కాలం స్పందించలేదు. అందుకు కారణం ఇరు కుటుంబాల్లో వీరిద్దరి ప్రేమని అంగీకరించకపోవడమే అంటూ వార్తలు వినిపించాయి.
Manchu Manoj – Bhuma Mounika : వాళ్ళిద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను.. మంచు మనోజ్!
ముఖ్యంగా మోహన్ బాబు వీరిద్దరి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా మనోజ్ అండ్ మౌనిక వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవరిస్తున్న ఒక టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో మౌనికని వెన్నెల కిషోర్.. అత్తయ్య, మామయ్యలతో తన అనుబంధం ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు. దీనికి మౌనిక బదులిస్తూ.. “మామయ్య గారు (Mohan Babu) చాలా సరదాగా ఉంటారు. మా పెళ్లి కాకముందు ఒకసారి ఆ ఇంటికి వెళ్ళితే మావయ్య గారు నాకు అన్నం తినిపించారు. అత్తయ్య అయితే ఎప్పుడూ ఫోన్ లో టచ్ లోనే ఉంటారు. ఇప్పుడే కాదు మా అమ్మ చనిపోయిన సమయంలో కూడా నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు” అంటూ చెప్పుకొచ్చింది.
Manchu Manoj – Bhuma Mounika : ఎవరు ఫస్ట్ ప్రొపోజ్ చేసారో తెలుసా.. అంతా సినిమా మాదిరి సీన్స్!
తనని, తన కొడుకుని వాళ్లిద్దరూ సొంతవాళ్లలా దగ్గరకు తీసుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. తనని ఒక కోడలిగా కాకుండా ఒక కూతురిగా వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానించారని, తనకి ఇది దేవుడిచ్చిన వరం అంటూ వ్యాఖ్యానించింది. ఇక ఇదే షోలో మౌనిక, మంచు లక్ష్మి (Manchu Lakshmi) పై కూడా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. మంచు లక్ష్మి తనకి మరో అమ్మ అంటూ చెప్పుకొచ్చింది.