బిగ్ బాస్ 3 : ఎలిమినేటెడ్ అయ్యేది ఎవరు 

  • Published By: madhu ,Published On : August 25, 2019 / 05:05 AM IST
బిగ్ బాస్ 3 : ఎలిమినేటెడ్ అయ్యేది ఎవరు 

బుల్లితెరపై బిగ్ బాస్ 3 హావా కొనసాగుతోంది. కాంట్రవర్సీలు, గొడవలు, ఏడ్పులతో రంజుగా సాగుతోంది. హోస్ట్‌గా నాగార్జున..అదరగొడుతున్నాడు. వీకెండ్ వచ్చే సరికి హౌస్‌లో ఉన్న వారికి..ప్రేక్షకులకు టెన్షన్..టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే..ఎలిమినేషన్ రౌండ్ తప్పనిసరి. ఓ వ్యక్తి హౌస్ నుండి బయటకు వచ్చేస్తారు. ఎవరు వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శివజ్యోతి, పునర్నవి, హిమజ, అషు, రాహుల్, మహేష్, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్ లిస్టులో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే..2019, ఆగస్టు 24వ తేదీ శనివారం జరిగిన ఎపిసోడ్‌లో మన్మథుడు నాగ్..ఇద్దరు (శివజ్యోతి, మహేష్) సేఫ్‌గా ఉన్నట్లు ప్రకటించారు. మిగిలిన ఐదుగురు (పునర్నవి, హిమజ, అషు, రాహుల్, బాబా భాస్కర్‌)లో ఎవరు బయటకు వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

విజయవంతంగా సాగిపోతున్న బిగ్ బాస్ 3లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 24వ తేదీ శనివారం ప్రసారమైన ఎపిసోడ్ అలరించింది. అందులో ప్రధానంగా…శ్రీముఖి..హౌస్‌లో దోమల మందు కొట్టడంతో ఈగ చనిపోయింది. దీనిపై బాబా భాస్కర్ సెటైర్స్ వేశాడు. చనిపోయిన ఈగ ప్రెగ్మెంట్ అని..ఖచ్చితంగా నీకు పాపం తగులుతుందంటూ కామెంట్ చేశారు. వెంటనే శ్రీముఖి తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యింది. ఈగ ఓ మంచి..ఈగ..నీ ఆత్మకు శాంతి చేకూరాలి..అంటూ చెప్పింది. కానీ..ఆగస్టు 25వ తేదీ ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలుస్తోంది.