బిగ్ బాస్ 3లో.. రాహుల్ చివరిపాట ఇదే

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 01:22 PM IST
బిగ్ బాస్ 3లో.. రాహుల్ చివరిపాట ఇదే

బిగ్ బాస్ 3 సక్సస్ ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకుని.. అందరికీ వినోదాన్ని పంచి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ వరకు వచ్చేసింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు రవికృష్ణ, శివజ్యోతిల పెర్ఫార్మెన్స్‌తో షో మొదలైంది. అల వైకుంఠపురములోని రాములో రాములా సాంగ్‌ కు వీరు పెర్ఫార్మ్ చేశారు.

ఆ తరవాత రోహిణి, హేమ, హిమజ, శిల్పా చక్రవర్తి, వితికా, పునర్నవి, మహేష్ విట్ట, తమన్నా, జాఫర్ ఒక్కొక్కరిగా వచ్చి పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్ లో నాగార్జున బ్లాక్ కలర్ డ్రస్ లో సూపర్ ఎంట్రీ ఇస్తూ.. డ్యాన్స్ చేశారు  

ఇక నాగ్ హౌస్ మెట్స్ ఫ్యామిలీస్ తో మాట్లాడారు. ఆ తర్వాత హౌస్ మెట్స్ తో మాట్లాడి.. రాహూల్ తో అదిరిపోయే సాంగ్ పాడించారు. బిగ్ బాస్ 3కి మేము వచ్చినాము.. ఆడిపాడి మేము ముందుకొచ్చినాము “వి ఆర్ ది గేమర్స్” అంటు టాప్ 5 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి గురించి అదిరిపోయే సాంగ్ పాడాడు రాహూల్.