బిగ్‌బాస్ 4 ఎలిమినేషన్: ఫస్ట్ వికెట్ డైరెక్టర్ సూర్య కిరణ్!

  • Edited By: vamsi , September 13, 2020 / 06:34 AM IST
బిగ్‌బాస్ 4 ఎలిమినేషన్: ఫస్ట్ వికెట్ డైరెక్టర్ సూర్య కిరణ్!

ఇంతకుముందు బిగ్‌బాస్ మూడు సీజన్లు బాగా పాపులర్ అవగా.. ఈ సీజన్ మాత్రం కాస్త హడావుడి లేకుండా వెళ్లిపోతూ ఉంది. ఏదో డబ్బింగ్ సినిమాని థియేటర్లో చూసినట్లు టీవీల ముందు ప్రేక్షకులు కూడా నిరాశగా చూస్తున్నారు. అయితే క‌ట్ట‌ప్ప ఎపిసోడ్‌ కాస్త ఆసక్తికర అంశంగా ఈ వారం నడిచింది. ఎప్పుడూ వినిపించే ఏడుపులు.. కనిపించే గొడవలే ఈసారి కూడా ఎక్కువగా కనిపిండంతో కొత్తదనం కోరుకునే వీక్షకులు ఎంజాయ్ చెయ్యలేకపోతున్నారు.

అయితే వీకెండ్ మొదలు అవగానే వచ్చేస్తున్న కింగ్ నాగార్జున కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇక ఈ వారం అంతా సాగిన కట్టప్ప సస్పెన్స్ వీడింది. Who is Kattappa in Bigg Boss 4 Telugu అంటూ సాగిన కట్టప్ప కథ మొత్తం ఉత్తిదేన‌ని తేలిపోయింది. హౌస్‌లో అలాంటి పాత్రే లేద‌ని, కానీ మీలో ఉన్న అనుమాన‌మే క‌ట్ట‌ప్ప అని, దానిని ప‌క్క‌న ప‌డెయ్యాలంటూ నాగార్జున‌ సలహఆ ఇచ్చేశాడు. అంతేకాదు వారం రోజులైనా ఇంటి స‌భ్యులు ఎవ్వరూ స‌రిగ్గా క‌నెక్ట్ అయిన‌ట్లు క‌నిపించ‌లేద‌ని అన్నారు.ఇదిలా ఉంటే ఈ వారం బయటకు వస్తున్న లీకుల ప్రకారం హౌస్ నుంచి దర్శకుడు సూర్య కిరణ్ ఎలిమినేట్ అయిపోతున్నారట. అన‌వ‌స‌ర‌మైన విషయాలలో దూరి లెక్చ‌ర్లు ఇవ్వ‌‌డంతో సూర్య‌కిర‌ణ్‌కు కాస్త ప్రేక్షకుల్లో నెగెటివ్ మార్క్‌లు పడ్డాయి. ఈ కోణంలోనే సూర్యకిరణ్‌కు పెద్దగా ఓటింగ్ పడలేదని అంటున్నారు. తొలి రోజు నుంచే ఎవ‌రి మీద ప‌డితే వారిమీద త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శించడం సూర్య కిర‌ణ్‌కు మైనస్ అయ్యింది. ఎదుటివారిని మాట్లాడ‌నివ్వ‌క‌పోవ‌డం, త‌న మాటే వినాలి, తను చెప్పినట్లే జరగాలి అనేంతలా మూర్ఖ‌త్వం.. చివరకు హౌస్‌లో సూర్యకిరణ్‌ను విల‌న్‌ను చేసింది.

ఈ క్రమంలోనే సూర్య కిర‌ణ్‌ను బ్యాగు స‌ర్దేసి బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపిచాల‌ని ప్రేక్షకులు నిర్ణయించుకున్నారు. అందుకే బిగ్‌బాస్ 4వ సీజన్‌లో సూర్యకిరణ్ ఫస్ట్‌ వికెట్‌గా బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్ అయిపోతున్నాడు. ఈ ఎలిమినేషన్‌కు సంబంధించిన ఎపిసోడ్ ఇవాళ(13 సెప్టెంబర్ 2020) ప్రసారం కాబోతుంది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి రచయితగా, దర్శకుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు దక్కించుకున్న సూర్య కిరణ్.. తెలుగులో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. పలు సీరియళ్లకు కూడా ఆయన కథలను అందించారు. దర్శకత్వం వహించారు. హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకుని తర్వాత విడాకులు తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన‌ ఈ దర్శకుడు బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో అందరికీ తెలిశారు. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్‌లో గంగ‌వ్వ‌, అభిజిత్‌, మెహ‌బూబ్ దిల్‌సే, అఖిల్ సార్థ‌క్‌, సూర్య కిర‌ణ్‌, సుజాత‌, దివి వైద్య ఉన్నారు.