Tollywood Release Dates : రెండేసి డేట్స్.. సేఫ్టీ కోసమా? క్లారిటీ లేకా?

‘భీమ్లా నాయక్’, ‘గని’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాల కోసం రెండేసి డేట్స్ లాక్ చేశారు మేకర్స్..

Tollywood Release Dates : రెండేసి డేట్స్.. సేఫ్టీ కోసమా? క్లారిటీ లేకా?

Tollywood Release Dates

Tollywood Release Dates: గతకొద్ది కాలంగా ఇండియన్ సినిమాలన్నీ డైలమాలో ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల రిలీజుల విషయంలో క్లారిటీ లేదు.. డేట్స్ మధ్య క్లాష్ తప్పడం లేదు.. పాన్ ఇండియా సినిమాలు వస్తే పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి. ఇంతలో మరో కొత్త వైరస్ వచ్చి పడింది. మళ్లీ నైట్ కర్ఫ్యూలు, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో అల్లకల్లోంగా మారింది.

Tollywood : టాలీవుడ్‌లో ఫుల్ జోష్.. విడుదలకు క్యూ కడుతున్న పెద్ద సినిమాలు..

కట్ చేస్తే.. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా విడుదల తేదీలు ఖరారు చేసుకుంటున్నాయి. టాలీవుడ్‌లో కొత్త సినిమాలు, క్రేజీ అండ్ ప్రెస్టీజియస్ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్‌మెంట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘ఎఫ్ 3’, ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్’, ‘గని’ సినిమాల విడుదల తేదీలు ఖరారు చేశారు. ఇప్పుడీ లిస్టులోకి మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా వచ్చి చేరింది.

RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. వీటిలో కొన్ని సినిమాలకు రెండేసి డేట్స్ అనౌన్స్ చేయడమే ఎక్కడో తేడా కొడుతుంది. ఇప్పటివరకు ముచ్చటగా మూడు సార్లు వాయిదా పడ్డ ‘ఆర్ఆర్ఆర్’ ఫైనల్ డేట్ (మార్చి 25) ఫిక్స్ చేసే ముందు మార్చి 18 లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని రెండు డేట్స్ అనౌన్స్ చేశారు.

Rama Rao On Duty : ‘రామారావు ఆన్ డ్యూటీ’ కి రెండు రిలీజ్ డేట్స్..

‘ఆచార్య’ ఏప్రిల్ 29, ‘సర్కారు వారి పాట’ మే 12.. ఈ రెండు సినిమాలు మినహాయిస్తే.. మిగతా సినిమాలన్నీ కూడా రెండేసి డేట్స్ సెట్ చేసుకున్నాయి. ‘ఆచార్య’ కి ఒక్కరోజు ముందు (ఏప్రిల్ 28) న ‘ఎఫ్ 3’ రాబోతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముందుగా అనుకున్న ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ‘భీమ్లా నాయక్’ మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు.

Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ కోసం రెండు రిలీజ్ డేట్స్..

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా, ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్న మూవీ ‘గని’. ముందుగా గతేడాది దీపావళికి రిలీజ్ అనుకున్నారు. తర్వాత డిసెంబర్ 24కి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు రెండు డేట్స్ అనుకుంటున్నారు. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న థియేటర్లలోకి ‘గని’ రానున్నట్లు ప్రకటించారు. రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ కోసం రెండు డేట్లను లాక్ చేశారు. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

Ghani : ‘గని’ కోసం రెండు రిలీజ్ డేట్స్!