Big Day : మరో ప్రాణం నిలబడింది..బిగ్ డే అన్న సోనూ సూద్

బిగ్ డే గా అభివర్ణించారు నటుడు సోనూ సూద్. చాలా క్లిష్టమైన కాలేయ మార్పిడి, గుండె శస్త్ర చికిత్స సూపర్ సక్సెస్ కావడం ఆనందంగా ఉందన్నారు.

Big Day : మరో ప్రాణం నిలబడింది..బిగ్ డే అన్న సోనూ సూద్

Sonu

Sonu Sood : సోనూ సూద్..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన ఈ నటుడు..రియల్ జీవితంలో మాత్రం హీరో అయ్యాడు. కరోనా సమయంలో అతను చేసిన సహాయం అంతా ఇంతా కాదు. ఆపదలో ఉన్న వారిని నేనున్నాను..అంటూ అక్కడ ప్రత్యక్షం కావడమో..లేక..ఇతర మార్గాల ద్వారా వారికి సహాయం అందించాడు. విదేశాల్లో చిక్కుకున్న వారిని, తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని రక్షించారు. దీంతో అతనికి ప్రజలు నీరాజనాలు పట్టారు.

Read More : Eco Friendly Ganesha Idols : ఆవు పేడతో చేసిన వినాయకుడి విగ్రహాలకు ఫుల్ డిమాండ్

అతడిని చూడటానికి కిలోమీటర్లు నడవడం, సైకిల్ పై రావడం..వంటివి చేశారు. ట్విట్టర్ వేదికగా తమకు సహాయం చేయాలని అన్నదే తడవుగా..వెంటనే వారికి తోచిన విధంగా సహాయం చేశారు సోనూ. ఆయనకు కొందరు గుడులు సైతం కట్టి పూజిస్తున్నారు.తాజాగా..మరో ప్రాణాన్ని నిలబెట్టారు. ఓ బాలుడికి కాలేయ మార్పిడి..గుండె శస్త్ర చికిత్స చేయించారు. ఈ సందర్భంగా..బాలుడి కుటుంబసభ్యులు..కృతజ్ఞతలు తెలియచేశారు. ట్విట్టర్ వేదికగా..వారు ఓ ట్వీట్ చేశారు.

Read More : Hair Loss Treatment Drug : బట్టతల మహిళలకు శుభవార్త..నివారణకు మెడిసిన్ వచ్చేసింది..

మద్దతు వల్ల…శుభమ్ కాలేయ మార్పిడి…గుండె శస్త్ర చికిత్స..వైద్యులు చేశారని..ఇప్పుడు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మీ సహాయానికి ధన్యవాదాలు తెలియచేస్తూ…ట్విట్టర్ లో ఓ ఫొటో పెట్టారు. దీనికి సోనూ రెస్పాండ్ అయ్యారు. బిగ్ డే గా అభివర్ణించారు. చాలా క్లిష్టమైన కాలేయ మార్పిడి, గుండె శస్త్ర చికిత్స సూపర్ సక్సెస్ కావడం ఆనందంగా ఉందన్నారు. సర్వశక్తిమంతుడికి ధన్యవాదాలు తెలిపారు.