వరల్డ్‌లో 3వది, ఆసియాలో 2వది : నెల్లూరులో బిగ్ మల్టీప్లెక్స్

10TV Telugu News

బిగ్‌ స్క్రీన్‌ అంటేనే ఓ 30 అడుగులు ఉంటుంది. అదే 106 అడుగుల స్క్రీన్‌ అయితే.. ఇంకెంత బాగుంటుందో కదా. ఇక ఆ స్క్రీన్ మీద సినిమా చూస్తే.. ఆహా.. ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ వాసులకు ఆ అనుభూతి దరిచేరనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌ ఉన్న థియేటర్లలో… ఇది మూడోది.
ప్రపంచంలో మూడోది.. ఆసియాలో రెండోది..
670 సీట్ల సామర్థ్యం, 3డీ సౌండ్‌ సిస్టమ్‌
ఏడున్నర ఎకరాల్లో.. 40 కోట్ల వ్యయంతో..
106 అడుగుల బిగ్‌ స్క్రీన్‌..

వినడానికే అద్భుతంగా ఉన్నా. ఇది నిజంగా నిజం. ఈ వండర్‌ యాక్టివిటీకి నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట వేదికగా మారింది. పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కన పిండిపాళెం దగ్గర దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 670 సీట్ల సామర్థ్యం, 3డీ సౌండ్‌ సిస్టమ్‌తో దేశంలోనే తొలిసారిగా 106 అడుగుల వెడల్పుతో తెర ఏర్పాటు చేస్తుండడం విశేషం. రూ.40 కోట్ల వ్యయంతో యూవీ క్రియేషన్స్‌కి సంబంధించిన వి -సెల్యులాయిడ్ సంస్థ .. ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టీఫ్లెక్స్‌ను నిర్మిస్తోంది. అంతేకాదు ఈ మల్టీప్లెక్స్‌లో ఒక్కోటి 170 సీట్ల సామర్థ్యంతో .. మరో రెండు తెరలు ఉంటాయి.
670 సీట్ల సామర్థ్యం
3డీ సౌండ్‌ సిస్టమ్‌
106 అడుగుల వెడల్పుతో తెర
రూ.40 కోట్ల వ్యయం
ఏడున్నర ఎకరాల విస్తీర్ణం
170 సీట్ల సామర్థ్యంతో మరో 2 తెరలు

ఇంత భారీ ప్రాజెక్టును ఈ ప్రాంతంలోనే నిర్మించడానికి.. ఈ మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం బాగా కసరత్తు చేసినట్లు అర్థమవుతోంది. ఇక్కడ సినిమా థియేటర్ ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుందని .. నిర్మాణం ప్రారంభమైన మొదట్లో ప్రజల్లో అనేక అనుమానాలు కలిగాయి. కానీ వీటినేమీ పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టింది వి-సెల్యులాయిడ్ సంస్థ.

ఈ మల్టీప్లెక్స్  .. మహానగరాలైన చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుమల తిరుపతికి కూడలి ప్రాంతమైన నాయుడుపేటకు .. కేవలం 10కి.మీ దూరంలో ఉంది. తెలుగు తమిళ రాష్ట్రాల ఆరాధ్య దైవం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంది. పర్యాటక ప్రాంతాలైన నేలపట్టు పక్షుల కేంద్రం, పులికాట్ సరస్సులకు అత్యంత చేరువలో ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రోకు 30కి.మీ.దూరంలో ఉంది. అటు రాకెట్ ప్రయోగాలు కూడా ఎక్కువగా జరుగుతుండటంతో.. తరచూ ఇక్కడికి విదేశీ సైంటిస్టులు రాక కూడా  పెరుగుతోంది. దుగరాజపట్నం పోర్టు ఏర్పడితే ఈ మల్టీప్లెక్స్‌కు పోర్టుకు మధ్య ఉన్న దూరం 30 కిలోమీటర్లు మాత్రమే.

మరోవైపు ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌కు చుట్టుపక్కల 15 కిలోమీటర్ల దూరంలో  శ్రీసిటీ, అపాచి, మాంబట్టు, మేనకూరు సెజ్‌లు ఉండటంతో పాటు వందలాది పరిశ్రమలున్నాయి. వీటిలో సుమారు 50వేల మంది వరకు ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. ఈ ప్రాంతమంతా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడికి వచ్చే జనాభా కూడా రోజురోజుకూ పెరుగుతోంది. అలాగే ఈ థియేటర్‌కు సమీపంలోనే అనేక ఇంజినీరింగ్ కాలేజీలు, ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఉండటం ప్లెస్‌ పాయింట్‌.
నాయుడుపేటకు 10కి.మీ దూరం
దగ్గర్లోనే చెంగాళమ్మ టెంపుల్
30 కిలోమీటర్లు మాత్రమే
శ్రీసిటీ, అపాచి, మాంబట్టు, మేనకూరు సెజ్‌లు

ఈ థియేటర్  నేషనల్ హైవే పక్కనే ఉంది. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు దగ్గరలోనే ఉన్నాయి. సూళ్లూరు పేట నుంచి చెన్నై వరకు .. అలాగే సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వరకు మంచి సదుపాయాలు, వసతులున్నాయి. అయినా సినిమా థియేటర్లు లేవు. దీన్నే యాజమాన్యం అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రేక్షకులతో  థియేటర్లు కిక్కిరిసిపోతాయన్న నమ్మకం వారిని ఇంత భారీస్ధాయిలో నిర్మాణం చేపట్టేందుకు పురికొల్పినట్లు తెలుస్తోంది.

అటు ప్రజలు కూడా ఇంత భారీ స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందంటున్నారు. ఇప్పటికే నిర్మాణం మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే గ్రాండ్ ఓపెనింగ్ ఉన్నట్లు సమాచారం. సో.. ఈ స్పెషల్‌ క్వాలిఫికేషన్‌తో .. నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట పేరు ఇక ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో చేరిపోనుంది అనడంలో ఆశ్చర్యం లేదు.