Tollywood : చిన్న సినిమాలతో వస్తున్న పెద్ద బ్యానర్లు..

మైత్రీ మూవీ మేకర్స్, సితారా ఎంటర్ టైన్మెంట్స్, గీతా ఆర్ట్స్ ప్రస్తుతం భారీ కమర్షియల్ సినిమాలు చేస్తున్న బిగ్ బ్యానర్స్. ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్నాయి. ఒక పక్కన పెద్ద పెద్ద స్టార్ హీరోలతో బిగ్ రేంజ్ సినిమాలు చేస్తూనే మరో పక్క యంగ్ హీరోలతో లోబడ్జెట్ సినిమాలు..............

Tollywood : చిన్న సినిమాలతో వస్తున్న పెద్ద బ్యానర్లు..

Geetha Arts

Small Movies :  మైత్రీ మూవీ మేకర్స్, సితారా ఎంటర్ టైన్మెంట్స్, గీతా ఆర్ట్స్ ప్రస్తుతం భారీ కమర్షియల్ సినిమాలు చేస్తున్న బిగ్ బ్యానర్స్. ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్నాయి. ఒక పక్కన పెద్ద పెద్ద స్టార్ హీరోలతో బిగ్ రేంజ్ సినిమాలు చేస్తూనే మరో పక్క యంగ్ హీరోలతో లోబడ్జెట్ సినిమాలు చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బడా నిర్మాణ సంస్థగా కొనసాగుతుంది. ఈ బ్యానర్ లో పెద్దపెద్ద సినిమాలే వచ్చాయి. ఇప్పుడు కూడా చిరంజీవి 154వ సినిమా, బాలకృష్ణ 107వ సినిమా, బన్నీ పుష్ప ది రూల్, విజయ్ దేవరకొండ ఖుషి.. ఇలా భారీ సినిమాలే నిర్మాణంలో ఉన్నాయి ఈ సంస్థ తరపున. ఇలా భారీ సినిమాలు తెరకెక్కిస్తూనే మరో వైపు చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవలే లావణ్య త్రిపాఠితో ‘హ్యాపీ బర్త్ డే’ సినిమా, గతంలో ఉప్పెన సినిమాలు చేశారు. ఇప్పుడు సుధీర్ బాబు, కృతిశెట్టి కాంబినేషన్ లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా, కిరణ్ అబ్బవరంతో ‘మీటర్’ సినిమా చేస్తున్నారు. మరిన్ని చిన్న సినిమాలు ఓకే చేయబోతున్నారు.

Mass Movies : మెల్లిగా మాస్ కి మారిపోతున్న హీరోలు..

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో ఉన్న మరో బడా నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ నుంచి పెద్ద పెద్ద కమర్షియల్ హిట్స్ వచ్చాయి. లోబడ్జెట్ మూవీస్ ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను ఏర్పాటు చేసి, బన్నీ వాసు ప్రొడ్యూసర్ గా స్మాల్ బడ్జెట్, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు చేస్తూ యువ తరాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. పిల్లా నువ్వులేని జీవితం, భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం లాంటి సక్సెస్ లతో ఫుల్ రైజ్ లో ఉన్న గీతా ఆర్ట్స్ పిక్చర్స్ 2 బ్యానర్ నుంచి ఇటీవల పక్కా కమర్షియల్ సినిమా వచ్చింది. చావు కబురు చల్లగా, ప్రతి రోజు పండగ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు నిర్మించింది. త్వరలో కిరణ్ అబ్బవరం వినరో భాగ్యం విష్ణుకథ, నిఖుల్ తో 18 పేజిస్ సినిమాలు తెరకెక్కిస్తోంది. గీత ఆర్ట్స్ కూడా మరికొంతమంది యువ డైరెక్టర్స్ కి అడ్వాన్స్ ఇచ్చింది.

Small Movies

 

భారీ బడ్జెట్ మూవీస్ చేస్తోన్న నిర్మాణ సంస్థల్లో మరోటి సితార ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు ఆ సంస్థ త్రివిక్రమ్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో లోబడ్జెట్ సినిమాలని తెరకెక్కిస్తోంది. ఇటీవల సిద్ధూ జొన్నలగడ్డతో డీజే టిల్లు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్, సిద్ధూ జొన్నలగడ్డ హీరోగానే నరుడి బ్రతుకు నటన, జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి తో అనగనగా ఒకరాజు, బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేస్తూ స్వాతి ముత్యం, పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా.. ఇలా చాలా చిన్న సినిమాలు ప్లాన్ చేశారు. ఇలా పెద్ద నిర్మాణ సంస్థలు చిన్న హీరోలతో చిన్న, మీడియం సినిమాలు నిర్మిస్తుండటం ఇండస్ట్రీకి మంచి పరిణామం.