Leo Movie: విజయ్ ‘లియో’ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయిన లోకేశ్..?

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ అనౌన్స్‌మెంట్‌తోనే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా.. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

Leo Movie: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ అనౌన్స్‌మెంట్‌తోనే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా.. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

Leo Movie: విజయ్ ‘లియో’ మూవీకి కళ్లు చెదిరే ఆఫర్.. కానీ పట్టించుకోని లోకేశ్!

ఇక ఇప్పటికే షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను లోకేశ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డే‌ట్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. మార్చి 14న లియో మూవీ నుండి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Vijay Leo : విజయ్ ‘లియో’లో విజయ్ సేతుపతి ఉన్నాడా?

కాగా, ఈ సినిమాలో అందాల భామ త్రిష, దర్శకుడు కమ్ యాక్టర్ గౌతమ్ మీనన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, అక్టోబర్ 19న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి మార్చి 14న లియో మూవీ నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు